హైదరాబాద్, జూన్ 28 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ మాసం బోనాల ఉత్సవాల పురస్కరించుకొని చారిత్రాక్మతమైన లాల్ దర్వాజా సింహ వాహిని శ్రీ మహంకాళి దేవాలయం అధ్యక్షుడు మారుతి యాదవ్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీల నడుమ గోల్కొండ కోట పై శ్రీ జగదాంబిక అమ్మవారి దేవాలయానికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యంతో బయలుదేరారు. ఈ సందర్భంగా మారుతి యాదవ్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలు చరిత్ర కలిగిన గోల్కొండ జగదాంబ అమ్మవారికి మా తొలి బోనం సమర్పించడం ఆనందంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు.
- Homepage
- Telangana News
- లాల్ దర్వాజ Temple లో ప్రత్యేక పూజలు
లాల్ దర్వాజ Temple లో ప్రత్యేక పూజలు
Leave a Comment