సికింద్రాబాద్, జూలై 02 (ఇయ్యాల తెలంగాణ) : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లిలో విషాదం జరిగింది. లిఫ్ట్ నుండి పడి పూజారి మృతి చెందాడు. తుకారాంగేట్ పీఎస్ పరిధిలో ఘటన జరిగింది. మారేడ్ పల్లి లోని డీ ప్రీతం ఇంట్లో పూజ నిర్వహించడానికి పూజారి నర్సింహా మూర్తి వచ్చారు. లిఫ్ట్ రాక ముందే గేట్ తెరచి అందులోకి ప్రవేశించి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.