Liver వ్యాధులపై అవగాహనా సదస్సు

 

పాలకొల్లు, జులై 20 (ఇయ్యాల తెలంగాణ) : పాలకొల్లు ఐఎంఏ హాలులో ప్రస్తుతం ఊపిరితిత్తులు లివర్‌ వ్యాధులపై హైదరాబాద్‌ యశోద హాస్పిటల్స్‌ వైద్య నిపుణులు ప్రస్తుత ఆధునిక వైద్య విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఊపిరితిత్తులకు వచ్చే ఆస్మా వ్యాధి ,లివర్‌ వ్యాధులపై తీసుకోవలసిన వైద్య విధానాలు, అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్సలపై అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్‌ వైద్యులు డాక్టర్‌ శ్యామ్‌ కుమార్‌, వై. గోపికృష్ణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ సభ్యులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సిహెచ్‌ సత్యనారాయణ మూర్తి, వైద్యులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....