LRS (లే అవుట్ల క్రమబద్ధీకరణ) కోసం కసరత్తు…!

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఇయ్యాల తెలంగాణ) : ఎల్‌ఆర్‌ఎస్‌ (లే అవుట్ల క్రమబద్ధీకరణ) దరఖాస్తులను పరిష్కరించటంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ చేస్తోంది. మూడు నెలల్లోనే ఈ దరఖాస్తులను క్లియర్‌ చేయాలనే ఉద్దేశ్యంతో సర్కార్‌ ఉంది. ఇదే విషయంపై అధికారులకు ఆదేశాలు కూడా అందాయి.

సాధ్యమైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 75 శాతం దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు లేనట్లు తేలటంతో? ఇటీవలే దరఖాస్తుదారులకు మరో అవకాశం కూడా కల్పించింది. కావాల్సిన పత్రాలను ఆన్‌ లైన్‌ లోనే సమర్పించేలా.. సవరణకు ఛాన్స్‌ ఇచ్చింది. వెబ్‌ సైట్‌ లో సిటిజన్‌ లాగిన్‌ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.2020లో ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ ను తీసుకొచ్చారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ స్కీమ్‌ లో భాగంగా?అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియపై తీవ్రస్థాయిలో విమర్శలు రాగా? గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో పెద్దగా ముందుకు వెళ్లలేదు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ?ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై ఫోకస్‌ పెట్టింది. సాధ్యమైనంత త్వరగా వీటిని పరిష్కరించాలని యోచిస్తోంది.2020 ఏడాదిలో చాలా మంది తమ ప్లాట్లకు సంబంధించి ఎల్‌ఆర్‌ఎస్‌ కు దరఖాస్తు చేసుకున్నారు. రూ. 1000 ఫీజును కూడా చెల్లించారు. ప్రస్తుతం ఈ దరఖాస్తులను పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్న క్రమంలో? చాలా మందికి ఎల్‌ఆర్‌ఎస్‌ నెంబర్‌ తెలియటం లేదు. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా దొరకటం లేదని చెబుతున్నారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ నెంబర్‌ ను సింపుల్‌ గా తెలుసుకునే అవకాశం ఉంది. ఇందుకు కేవలం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఫోన్‌ నెంబర్‌ ఉంటే సరిపోతుంది.

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ష్ట్రబిబిజూబ://శ్రీతీబ.బివశ్రీజీనిణజీనిజీ.ణనీల.తిని/ వెబ్‌ సైట్‌ లోకి వెళ్లాలి.

ఇక్కడ ఆఫీసియల్‌ లాగిన్‌, సిటిజన్‌ లాగిన్‌ కనిపిస్తుంది.

సిటిజన్‌ లాగిన్‌ పై నొక్కాలి.

ఇక్కడ విూ మొబైల్‌ నెంబర్‌ ను నమోదు చేయాలి. విూకు ఓటీపీ వస్తుంది.ఆ నెంబరును ఎంట్రీ చేయాలి.

వెరిఫైయిడ్‌ ఓటీపీపై క్లిక్‌ చేస్తే విూకు హోం పేజీ ఓపెన్‌ అవుతుంది.

ఇక్కడ అప్లికేషన్‌ స్టేటస్‌ అనే ఆప్షన్‌ పై కనిపిస్తుంది.

దీనిపై నొక్కితే ఇక్కడ విూ అప్లికేషన్‌ నెంబర్‌ కనిపిస్తుంది. విూ వివరాలు కూడా డిస్‌ ప్లే అవుతాయి.

విూ దరఖాస్తు యొక్క స్థితి(స్టేటస్‌) కూడా తెలుస్తుంది.

పేమెంట్‌ చేసిన వివరాలను కూడా ప్రింట్‌ తీసుకునే అవకాశం ఉంటుంది.

అప్‌ లోడ్‌ చేసేందుకు మరోసారి ఛాన్స్‌?!

దరఖాస్తు చేసుకున్న సమయంలో చాలా మంది ధ్రువపత్రాల వివరాలను ఇవ్వలేదు. దీంతో చాలా అప్లికేషన్లపై సందిగ్ఘత నెలకొంది. దీంతో సంబంధిత పత్రాలను అప్‌ లోడ్‌ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

సిటిజిన్‌ లాగిన్‌ లోకి వెళ్లి? సేల్‌ డీడ్‌, ఈసీ, మార్కెట్‌ విలువ ధ్రువీకరణ పత్రం, లేఅవుట్‌ కాపీ వంటి డాక్యుమెంట్లను దరఖాస్తులను అప్‌ లోడ్‌ చేసుకోవచ్చు. మరోవైపు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలు, జిల్లా కలెక్టరేట్లలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్‌ పేర్కొంది.దరఖాస్తుదారులు ష్ట్రబిబిజూబ://శ్రీతీబ.బివశ్రీజీనిణజీనిజీ.ణనీల.తిని/శ్రీజీవనీబీబిబ/ వెబ్‌ సైట్‌ లోకి వెళ్లి ప్రాసెస్‌ ను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ అప్లికేషన్స్‌ అప్‌ లోడ్‌ ఆప్షన్‌ పై నొక్కి?. విూ ప్లాట్‌ కు సంబంధించిన పత్రాలను అప్‌ లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సేల్‌ డీడ్‌, ఈసీ, మార్కెట్‌ విలువ నిర్ధారిత పత్రం, లేఅవుట్‌ కాపీ తదితర పత్రాలను అప్‌ లోడ్‌ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్‌ 5 ఎంబీలోపే ఉండాలి. ధ్రువపత్రాలను అప్‌ లోడ్‌ చేయటం ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సర్కార్‌ భావిస్తోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....