Mahatma Gandhi – మార్గం అనుసరణీయం“ – మాజీ రాజ్యసభ సభ్యులు TG వెంకటేష్‌

కర్నూలు, అక్టోబర్ 02 (ఇయ్యాల తెలంగాణ) : జాతిపిత మహాత్మా గాంధీ చూపించిన మార్గం ప్రతి ఒక్కరు అనుసరించదగ్గదని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగాస్థానిక జిల్లా పరిషత్‌ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  అహింసే ఆయుధంగా, దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత గాంధీ మహాత్మునికే దక్కుతుందని టీజీ వెంకటేష్‌ అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లిన మహాత్మా గాంధీ విగ్రహాలు ఉన్నాయి అంటే ఆయన ఘన కీర్తి ఏమిటో మనమర్థం చేసుకోవచ్చన్నారు.  గాంధీ మార్గం ప్రతి ఒక్కరూ అనుసరిస్తే ప్రపంచమంతా శాంతియుతంగా ఉంటుందని టీజీ అన్నారు. ఇప్పుడున్న వారితో పాటు, రాబోయే తరాల వారు కూడా గాంధీ తత్వాన్ని అర్థం చేసుకుని, గాంధీ మార్గాన్ని ఆచరిస్తే ప్రపంచంలో శాంతి పడరవిల్లుతుందని టీజీ వెంకటేష్‌ అన్నారు.  ఈ కార్యక్రమంలో టీజీవి ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు బాలయ్య, పాల్‌ రాజు, ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....