`మహావతార్‌ నరసింహ Song రిలీజ్‌

భారతీయ సినిమా రంగాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో అదరగొడుతున్న హోంబలే ఫిల్మ్స్‌, భారీ బడ్జెట్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ఈ సంస్థ, ఇప్పుడు క్లీమ్‌ ప్రొడక్షన్స్‌తో మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (ఓఅఙ) అనే గొప్ప ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ఇది భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని లార్డ్‌ విష్ణు దశావతారాలను కట్టింగ్‌ ఎడ్జ్‌ యానిమేషన్‌, గొప్ప స్టొరీ టెల్లింగ్‌, సినిమాటిక్‌ స్కేల్‌లో రీఇమాజిన్‌ చేయనుంది.

మహావతార్‌ యూనివర్స్‌ 12 సంవత్సరాల ప్లానింగ్‌ తో ప్రారంభమవుతుంది. ఈ పయనం మొదటి అడుగు మహావతార్‌ నరసింహ రూపంలో, జూలై 25, 2025న 3ఆ ఫార్మాట్‌లో, భారతదేశంలోని ఐదు ప్రధాన భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకుడు అశ్విన్‌ కుమార్‌, నిర్మాతలు శిల్పా ధవాన్‌, కుశల్‌ దేశాయి, చైతన్య దేశాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌ వైరల్‌ గా మారి మేకర్స్‌ విజన్‌పై అంచనాలను పెంచింది.

ఈ యూనివర్స్‌ దశావతారాలను తెరపైకి తీసుకొస్తుంది. 2025లో నరసింహ, 2027లో పరశురామ, 2029లో రఘునందన్‌, 2031లో ద్వారకాధీశ్‌, 2033లో గోకులానంద, 2035లో మహావతార్‌ కల్కి ` పార్ట్‌ 1, 2037లో మహావతార్‌ కల్కి ` పార్ట్‌ 2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

తాజాగా ‘మహావతార్‌ నరసింహ’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘రోర్‌ అఫ్‌ నరసింహ’ ను విడుదల చేశారు. స్టార్‌ కంపోజర్‌ సామ్‌ సి.ఎస్‌ ఈ పాటను డివైన్‌ వైబ్స్‌తో పవర్‌ఫుల్‌గా కంపోజ్‌ చేశారు. సామ్‌ సి.ఎస్‌, రాకేందు మౌళి పవర్‌ఫుల్‌ సాహిత్యాన్ని అందించడమే కాక, అంతే ఎనర్జీటిక్‌గా కూడా పాడారు. ఈ సాంగ్‌ ప్రస్తుతం అన్ని మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్‌ ట్రెండిరగ్‌లో ఉంది.      

దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ మాట్లాడుతూ..’’భారతీయ వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నంలో, మా క్లీమ్‌ ప్రొడక్షన్స్‌, హోంబలే ఫిల్మ్స్‌ కలిసి పని చేయడం గర్వంగా ఉంది. ఇది కేవలం సినిమా కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి’అన్నారు

నిర్మాత శిల్పా ధవాన్‌ మాట్లడుతూ.. ఇప్పుడు మన కథలు తెరపై అలరించబోతున్నాయి. ఇది ఒక అద్భుతమైన సినిమా ప్రయాణం.’’

హోంబలే ఫిల్మ్స్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. సరిహద్దులను దాటి చెప్పే కథనాలపై మా నమ్మకం ఉంది. మహావతార్‌ ద్వారా మన దేశపు ఆధ్యాత్మిక వారసత్వానికి ఓ గొప్ప నివాళిగా ఈ సినిమాటిక్‌ యూనివర్స్‌ను అందిస్తున్నాము’అన్నారు

మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ కేవలం సినిమాలకే పరిమితం కాదు. ఇది ఓ సంస్కృతిక ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. గ్రాఫిక్‌ నవలలు, వీడియో గేమ్స్‌, డిజిటల్‌ కథనాలు, కలెక్టిబుల్స్‌ రూపంలో ఈ కథలు ప్రేక్షకులను విభిన్నంగా చేరనున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి వయస్సు వారిని అలరించేలా ఈ యూనివర్స్‌ నిర్మాణం సాగుతుంది.

హోంబలే ఫిల్మ్స్‌ , క్లీమ్‌ ప్రొడక్షన్స్‌..ఈ డైనమిక్‌ కొలాబరేషన్‌ ఒక గొప్ప సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....