మళ్లీ హుషారుగా థియేటర్లలోకి హుషారు ?

యువతను నవ్వించి, వివిద భావోద్వేగాలతో మనసును హత్తుకున్న చిత్రం హుషారు మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కాలేజీ రోజుల అనుభూతులను, స్నేహితుల మధ్య బంధాన్ని, యువత ఎదుర్కొనే సవాళ్ళను హాస్య, భావోద్వేగాలతో తీసిన ఈ చిత్రం జూలై 5న రీ`రిలీజ్‌ కానుంది.

లక్కీ విూడియా, రూఎఔ, ఊఐ ఫిలిమ్స్‌ సమర్పణలో, లక్కీ విూడియా బ్యానర్‌ పై బెక్కెం వేణుగోపాల్‌ , రియాజ్‌ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ హర్ష కొంగంటి దర్శకత్వం వహించారు. మొదటి విడుదల సమయంలోనే ఈ చిత్రం యూత్‌లో భారీ క్రేజ్‌ తెచ్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే క్రేజ్‌తో థియేటర్లకు తిరిగి వస్తోంది.

ఈ చిత్రంలో తేజస్‌ కంచెర్ల, తేజ్‌ కురపాటి, అభినవ్‌ మేడిశెట్టి, దినేష్‌ తేజ్‌ వంటి యువ నటులు పాత్రలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసాయి. సంగీత దర్శకుడు రధన్‌ అందించిన పాటలు అప్పట్లో యువత ఫేవరెట్‌గా మారాయి.

యువత జీవితాన్ని ప్రతిబింబించిన ఈ చిత్రం మళ్లీ ఒక మంచి అనుభూతిని అందించనుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....