Manda కృష్ణ కు పద్మశ్రీ లభించడం ఆనంద దాయకం !


హైదరాబాద్,జనవరి 27 ఇయ్యాల తెలంగాణ
:  30 సంవత్సరాల నుంచి మాదిగల సమస్యలపై పోరాడుతున్న మందకృష్ణ మాదిగ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం చాలా అభినందించ దగ్గ విషయమని అఖిల భారత కోహ్లీ ముదిరాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్  పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటంతో మాదిగల్లో చైతన్యం నింపడంతో పాటు షెడ్యూల్డ్ కులాలలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కాలని, రిజర్వేషన్ తప్పితే నాకు ఏది ముఖ్యం కాదు అనే అంశం మీద ఎటువంటి తైలాలకు లొంగకుండా జాతి ప్రయోజనం కోసం కమిట్మెంట్ గా పనిచేసిన మందకృష్ణ మాదిగకు ప్రత్యేక అభినందనలు అని తెలిపారు. ఒక దేశ ప్రధాని కుల సంఘానికి పిలిపించిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కిందని కొనియాడారు. తన జాతి ప్రయోజనాల కోసం అంకితమై తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగను  చూసి మిగతా అన్ని కుల సంఘాలు తెలుసుకోవాలని, మందకృష్ణ సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం అత్యంత శుభ పరిణామమని తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....