హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ న్యూమెరస్ మోటార్స్ … మల్టీ యుటిలిటీ ఈ స్కూటర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్ లో న్యూమెరస్ మోటార్స్ ఈవీ స్కూటర్ వైస్ ప్రెసిడెంట్ సౌందరరాజన్ లాంచ్ చేశారు. అత్యాధునిక ఫీచర్ల తో రూపొందించిన ఇవి స్కూటర్ డ్యుయల్ బ్యాటరీతో పనిచేస్తుందని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోవిూటర్లు ప్రయాణించవచ్చున్నారు. ప్రస్తుతం 14 నగరాల్లో తమ నెట్వర్క్ విస్తరించామని.. 2026 నాటికి 170 మంది షోరూములు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడిరచారు.