May 22 న దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న 103 Railway స్టేషన్లు

హైదరాబాద్‌, మే 21 (ఇయ్యాల తెలంగాణ) :  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం తర్వాత వాటిని తిరిగి ప్రారంభించనున్నారు. మే 22, 2025న ప్రధాని మోదీ వర్చువల్‌గా జరగనున్న కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా అత్యాధునికంగా తీర్చిదిద్దన రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. వీటిలో తెలంగాణ నుంచి కరీంనగర్‌, వరంగల్‌, బేగంపేట రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లన్నీ అమృత భారత్‌ స్టేషన్‌ యోజనలో భాగంగా రీడిజైన్‌ చేసి, అత్యాధునికంగా తీర్చిదిద్దారు. వీటిలో మధ్య రైల్వేకు చెందిన 12 ప్రధాన స్టేషన్లు ఉన్నాయి. వీటిని రూ. 138 కోట్లకు పైగా ఖర్చుతో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఆ రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేసింది.రైల్వే మంత్రిత్వ శాఖ డిసెంబర్‌ 2022లో అమృత భారత్‌ స్టేషన్‌ యోజన ప్రారంభించించింది.  దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్లను ఆధునిక రవాణా కేంద్రాలుగా మార్చాలనే లక్ష్యంతో పనులు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 6, 2023, ఫిబ్రవరి 26, 2024 తేదీల్లో రెండు దశల్లో రైల్వే స్టేషన్ల పునరుద్దరణకు  చేశారు.

కరీంనగర్‌, వరంగల్‌, బేగంగపేట రైల్వేస్టేషన్లు సైతం

దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో శ్రీధర్‌ సోమవారం విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బేగంపేటతో పాటు కరీంనగర్‌, వరంగల్‌ రైల్వే స్టేషన్లను సైతం 103 రైల్వే స్టేషన్లతో పాటు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌ను రూ. 25.85 కోట్లు, వరంగల్‌ రైల్వే స్టేషన్‌ను రూ.25.41 కోట్లు, బేగంపేట రైల్వేస్టేషన్‌ను రూ.26.55 కోట్లతో కేంద్రం అభివృద్ధి చేసింది. విమనాశ్రయాన్ని తలపించేలా రైల్వే స్టేషన్లను కేంద్రం డెవలప్‌ చేసిందన్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలకు అనుగుణంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ సైతం ఏర్పాటు చేశామన్నారు.అంధులు సైతం ఎవరి సాయం లేకుండా వరంగల్‌ రైల్వే స్టేషన్లో టెక్టైల్‌ ఫ్లోరింగ్‌ ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్‌ డివిజనల్‌ అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఐ శ్రీరామమూర్తి తెలిపారు. కరీంనగర్‌ రైల్వేస్టేషన్లో రెండు లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు, 2 కొత్త ప్లాట్‌ఫాంలు సిద్ధం చేశామని సికింద్రాబాద్‌ రైల్వే అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌ పి శివప్రసాద్‌ తెలిపారు.

కేవలం 15 నెలల్లో మధ్య రైల్వే స్టేషన్లు  పునర్నిర్మాణంమధ్య రైల్వే 12 స్టేషన్లను కేవలం 15 నెలల్లో అభివృద్ధి చేశారు. వాటిలో ముంబైలోని చిన్చపోక్లి, పరేల్‌, వడాలా రోడ్‌, మాటుంగా రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఈ స్టేషన్లను ఆధునిక సాంకేతికత, వికలాంగులకు అనుకూలమైన సౌకర్యాలుతో అభివృద్ధి చేశారు.

మాటుంగా స్టేషన్‌ ` ఖర్చు రూ. 17.28 కోట్లు

భారతదేశంలో మొట్టమొదటి మహిళా నిర్వహణ స్టేషన్‌ మాటుంగా ఇప్పుడు మరిన్ని హంగులు సంతరించుకుంది. ప్లాట్‌ఫామ్‌ విస్తరణ, వికలాంగులకు అనుకూలమైన ఏర్పాట్లు, ఎలివేటెడ్‌ బుకింగ్‌ ఆఫీసు నవీకరణ, స్టేషన్‌ను మరింత అందంగా చేశారు. రోజుకు సుమారు 37,927 మంది ప్రయాణీకులకు ఈ స్టేషన్‌ సేవలు అందిస్తోంది.

చిన్చపోక్లి స్టేషన్‌ ` ఖర్చు రూ. 11.81 కోట్లు

ముంబై లోని చిన్చపోక్లి స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు, బుకింగ్‌ ఆఫీసు, వెయిటింగ్‌ ఏరియా, త్రాగునీటి బూత్‌, వెర్టికల్‌ గార్డెన్‌, సర్కులేటింగ్‌ ఏరియాలో అనేక సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ రోజుకు సగటున 36,696 మంది ప్రయాణస్తుంటారు.

పరేల్‌ స్టేషన్‌ ` ఖర్చు రూ. 19.41 కోట్లు

ఇక్కడ కొత్త స్టేషన్‌ భవనం, మరుగుదొడ్లు, పార్కింగ్‌, నీటి పారుదల వ్యవస్థ, తోటలు మరియు బుకింగ్‌ ఆఫీసు నిర్మించారు. రోజుకు 47,738 మంది ప్రయాణీకులు ఈ స్టేషన్‌ను ఉపయోగిస్తున్నారు.

వడాలా రోడ్‌ స్టేషన్‌ ` ఖర్చు రూ. 23.02 కోట్లు

స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫామ్‌లు, ఈూఃలు, బుకింగ్‌ ఆఫీసు, మరుగుదొడ్లు మరియు ప్రవేశ ద్వారాలను నవీకరించారు. ఇక్కడ రోజుకు సగటున 1.32 లక్షల మంది ప్రయాణీకులు వస్తుంటారు.

మహారాష్ట్రలో 132 స్టేషన్ల పునర్నిర్మాణం

కేవలం మహారాష్ట్రలోనే మొత్తం 132 స్టేషన్ల పునర్నిర్మాణం జరుగుతోంది. వీటిలో మే 22న 18 స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.  ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు, స్టేషన్లో సేవలు సులభతరం, సురక్షిత ప్రయాణాన్ని అందించడంతో పాటు స్టేషన్లను అభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా మార్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

సూళ్లూరుపేట  స్టేషన్

ఇండియన్‌ రైల్వే స్టేషన్‌ లు అంటే అంత నీట్‌ గా ఉండవు అనేది గతం. అమృత్‌ భారత్‌ పథకం కింద  ఇప్పుడు దేశంలోని చాలా స్టేషన్లను  పూర్తిస్థాయిలో డెవలప్‌ చేస్తోంది రైల్వే శాఖ. వాటిలో చాలావరకు నిర్మాణ దశలో ఉండగా ఏపీలోని ‘‘సూళ్లూరుపేట ‘‘కంప్లీట్‌ గా న్యూ లుక్‌ లో రెడీ అయిపోయింది. రేపు అంటే మే 22 న ప్రధాని మోదీ చేతుల విూదుగా  సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ ప్రారంభం కాబోతుంది. అమృత్‌ పథకం లో భాగంగా  తొలిసారి ప్రారంభం కాబోతున్న స్టేషన్గా  ‘‘ సూళ్లూరుపేట ‘‘ ఏపీలో చరిత్ర సృష్టించడానికి రెడీ అయిపోయింది. సూళ్లూరుపేట ఏపీ, తమిళనాడు బోర్డర్లో ఉన్న పెద్ద టౌన్‌. ఇక్కడికి తమిళనాడు బోర్డర్‌ కేవలం 12 కిలోవిూటర్లు మాత్రమే. ఈ స్టేషన్‌ దాటాక అక్కంపేట, తడ స్టేషన్లు దాటితే చాలు తమిళనాడులోకి ఎంటర్‌ అయిపోతాం. ఈ స్టేషన్‌ గుండా 42 ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు, 28 ఇఓఙ ట్రైన్స్‌ ప్రయాణం చేస్తుంటాయి. ‘‘సూళ్లూరుపేట’’  ను ఔూఉ`5 (నాన్‌ సబర్బన్‌ గ్రూపు)  కేటగిరీ లో ఉంచింది ఇండియన్‌ రైల్వే. అంటే రోజుకి కనీసం 9,000 మందికి పైగా ప్రయాణికులు ఈ స్టేషన్‌ నుంచి జర్నీ చేయాల్సి ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఎూఖీూ ఇక్కడికి జస్ట్‌ 18 కిలోవిూటర్లు. అలాగే ప్రాచీన చెంగాలమ్మ ఆలయం  ఈ ఊర్లోనే ఉంది. ప్రతి శాటిలైట్‌ ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు చెంగాలమ్మ ఆలయాన్ని సందర్శించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.పక్షుల అభయారణ్యం, పులికాట్‌ సరస్సు ఇక్కడికి అతి సవిూపంలో ఉన్నాయి. ఇలా ‘‘సూళ్లూరుపేట ‘‘ ఏ విధంగా చూసినా  ఏపీ లో ముఖ్యమైన టౌన్‌ గా ఉంటూ వస్తోంది. ఇవన్నీ గమనించి ఈ స్టేషన్ను డెవలప్‌ చేయడానికి 14.5 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్రం. ఆ నిధులతో కనీ విని ఎరుగని స్థాయిలో  సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ ను రెడీ చేశారు అధికారులు.సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ ను ప్రస్తుతం ఎవరైనా తెలియని వాళ్ళు బయటినుంచి చూస్తే ఒక చిన్న సైజు ఎయిర్పోర్టు లాగా కనిపిస్తుంది. పూర్తిగా ట్రెడిషనల్‌ లుక్‌ ఉట్టిపడేలాగా స్టేషన్కు ఎలివేషన్‌ ఇచ్చారు. అలాగే హైటెక్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌, లైట్లతో వెలిగిపోయేలా సీలింగ్‌ , అధునాతన సీటింగ్‌ సౌకర్యం, ప్లాట్‌ ఫామ్‌ ల మధ్య మారడానికి రెండేసి లిఫ్ట్లు, క్రొత్త ప్లాట్‌ ఫామ్‌ లు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండేలా స్టేషన్‌ ను డిజైన్‌ చేసారు. ఎక్కడికి అక్కడ వాటర్‌ ఫెసిలిటీ తో పాటు భవిష్యత్తు అవసరాలకు పనికొచ్చేలా  కంప్లీట్‌ గా న్యూ లుక్‌ లో రైల్వే స్టేషన్‌ రెడీ చేసినట్టు చెన్నైకు చెందిన గతి శక్తి అధికారి డిప్యుటీ చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశన్‌, చెన్నై డివిజన్‌ ఖఖీూ ఏలుమలై తెలిపారు.పూర్తిగా న్యూ లుక్‌ లోకి మారిపోయిన  ‘‘ సూళ్లూరుపేట ‘‘ రైల్వే స్టేషన్‌ ను  రేపు ప్రధాన మోడీ  స్వయంగా ప్రారంభించనున్నారు. దీనితోపాటు దేశవ్యాప్తంగా వందకు పైగా స్టేషన్లను ఆయన వర్చువల్‌ పద్ధతిలో దేశానికి అంకితం చేస్తారు. ఏపీలో నిర్మాణంలో ఉన్న  మిగిలిన అన్ని అమృత్‌ భారత్‌ స్టేషన్‌ లకు ఒక రోల్‌ మోడల్‌ గా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ రెడీ అయ్యింది అని స్థానికులు సంబరపడుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....