May 25న హీరో కార్తికేయ ‘‘భజే వాయు వేగం’’ Movie ట్రైలర్‌ Release

ఈ నెల 25న హీరో కార్తికేయ ‘‘భజే వాయు వేగం’’ సినిమా ట్రైలర్‌ విడుదల

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘భజే వాయు వేగం’’. ఐశ్వర్య విూనన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. హ్యాపీ డేస్‌ ఫేమ్‌ రాహుల్‌ టైసన్‌ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు ప్రశాంత్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్‌ కుమార్‌ రాజు.పి. కో ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల31న ‘‘భజే వాయు వేగం’’ సినిమా వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు వస్తోంది. ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ అనౌన్స్‌ మెంట్‌ చేశారు మేకర్స్‌. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం 12.15 గంటలకు ‘‘భజే వాయు వేగం’’ సినిమా ట్రైలర్‌ ను రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటించారు. సరికొత్త ఎమోషనల్‌ యాక్షన్‌ డ్రామాగా ‘‘భజే వాయు వేగం’’ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ట్రైలర్‌ తో మరింత హైప్‌ పెరుగుతుందని చిత్రబృందం ఆశిస్తున్నారు.

నటీనటులు ` కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య విూనన్‌, రాహుల్‌ టైసన్‌, తనికెళ్ల భరణి, రవిశంకర్‌, శరత్‌ లోహితస్వ తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....