MBBS కోసం Telangana కు AP విద్యార్థులు

హైదరాబాద్‌, ఆగస్టు 4, (ఇయ్యాల తెలంగాణ): ఎంబీబీఎస్‌ చదువు కోసం ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు పెద్ద ఎత్తున తెలంగాణకు వస్తున్నారన్నారని మంత్రి హరీష్‌ రావు అన్నారు. శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ.. ఏపీలోని పాత ఐదు మెడికల్‌ కాలేజీల్లోనే ఆంధ్రా విద్యార్థులకు 15 శాతం సీట్లు వస్తున్నాయని అన్నారు. కొత్తగా ఏర్పాటైన 26 మెడికల్‌ కాలేజీల్లో 100 శాతం ఎంబీబీఎస్‌ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఉస్మానియా ఆసుపత్రిని అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తామని ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించిందని తెలిపారు.

విధుల్లో చేరిన ప్రభుత్వ వైద్యులకు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం విధించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్‌ వైట్‌, పింక్‌, గ్రీన్‌, బ్లూ విప్లవం తీసుకొచ్చారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలు 60 ఏళ్లలో 2 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తే, కేసీఆర్‌ సర్కార్‌ తొమ్మిదేళ్లలో 29 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. దేశంలోని మొత్తం ఎంబీబీఎస్‌ సీట్లలో 43 శాతం తెలంగాణ విద్యార్థులు సాధిస్తున్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ తర్వాత తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అలాగే కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ దేశానికే డాక్టర్లను తయారుచేస్తోందని మంత్రి అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....