MLA క్యాంపు కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించిన సీతక్క

ములుగు అక్టోబర్ 24 (ఇయ్యాల తెలంగాణ );ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో  విజయదశమి పర్వదినం శుభ సందర్భంగా ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క  ఆయుధ పూజలు నిర్వహించారు.

 ఈ సందర్భంగా సీతక్క  మాట్లాడుతూ దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం అని, ఈ పది రోజుల పండుగని ‘నవరాత్ర వ్రతం’ అనీ, ‘దేవీ నవరాత్రులు’, ‘శరన్నవరాత్రులు’ అని వ్యవహరిస్తారు అని అన్నారు. తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతం తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం అని అన్నారు. విజయ దశమి ‘దసర’ చెడు విూద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని పది రోజుల పాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు అని అందుకే ప్రతి ఒక్కరూ చెడుపై మంచి విజయం సాధించాలని ఆయుధ పూజ నిర్వహిస్తారని అన్నారు. ఆ అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్న అని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆయుధ పూజ నిర్వహించారు.    ఈ కార్యక్రమంలో సీతక్క  వ్యక్తిగత అంగరక్షకులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....