MLA గా పద్మరావు గౌడ్‌ ప్రమాణము

సికింద్రాబాద్‌,డిసెంబర్‌ 14 (ఇయ్యాల తెలంగాణ) : సికింద్రాబాద్‌ ఎం ఎల్‌ ఏ తీగుల్ల పద్మరావు గౌడ్‌  గురువారం అసెంబ్లీ లో  ఎం ఎల్‌ ఏ గా ప్రమాణం చేశారు. ఎం ఎల్‌ ఏ గా ప్రోటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆయనతో ప్రమాణం చేయించారు. 2014 నుంచివరుసగా మూడో సారి ఎం ఎల్‌ ఏ గా ఎన్నికై సికింద్రాబాద్‌ లో హ్యాట్రిక్‌ సాధించిన పద్మారావు గౌడ్‌ తొలుత 2004 లో ఎం ఎల్‌ ఏ గా ఎన్నికయ్యారు.  అప్పటి ఎన్నికల్లో  ఆయనను 3067 ఓట్ల మెజారిటీలభించింది. తెలంగాణ కోసం రాజీనామా చేసిన అయన  ఆ ఉప ఎన్నికల్లో  విజయం సాధించలేదు.అనంతరం 2014, 2018, 2023ల్లో వరుసగా ఎం ఎల్‌ ఏ గా ఎన్నికయ్యారు. ప్రతి ఎన్నికల్లో ఆయనసాధించిన మెజారిటీ పెరుగుతూ తాజాగా 45,240 ఓట్ల ఆధిక్యతను సాధించి సికింద్రాబాద్‌ లో  హ్యాట్రిక్‌ తో ఎం ఎల్‌ ఏ రికార్డు ను నెలకొల్పారు.ఈ సందర్బంగా అయన ను నియోజకవర్గం లో పలువురుఅభినందనలు తెలిపారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....