MLCల పేర్లు తిరస్కరణ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25, (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు.  గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు.  ప్రభుత్వం సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ.. అభ్యర్థిత్వాలను రిజెక్ట్‌ చేశారు. ఆర్టికల్‌ 171 (5)` ప్రకారం ఈ అభ్యర్థులకు తగిన అర్హత లేదన్నారు. ఈ ఇద్దరిని ఎంపిక చేయడానికి కావాల్సిన సమాచారం తన వద్దకు రాలేదని తెలిపారు. కుర్రా సత్యనారాయణ రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నారని.. సామాజిక సేవ కార్యక్రమాల్లో ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని తమిళిసై పేర్కొన్నారు. మన రాష్ట్రంలో చాలా మంది వివిధ రంగాల్లో ప్రముఖలు ఉన్నా.. వారిని పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. రాజకీయ నాయకులను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని.. అలా చేయడం ఆర్టికల్‌ 171 (5)కి విరుద్దం అని ముఖ్యమంత్రికి, కేబినెట్‌కు సూచించారు. దాసోజు శ్రవణ్‌ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏ రంగంలోనూ దాసోజు శ్రవణ్‌ అచివ్‌మెంట్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించలేదని పేర్కొన్నారు. అర్హత ఉన్న వ్యక్తులను కేబినెట్‌ సిఫార్సు చేస్తే నియమిస్తానని తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....