MLC కవిత బెయిల్‌ పై సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ !

హైదరాబాద్, ఆగష్టు 27 (ఇయ్యాల తెలంగాణ) : బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి, తిహాడ్‌ జైలులో ఉన్న కవిత బెయిల్‌పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది. కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణను జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌ ధర్మాసనం నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్‌ కేసు విజయ్‌ నాయర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడటంతో కవిత బెయిల్‌ పిటిషన్‌ కేసు ఏమవుతుందోనన్న ఆందోళన బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నెలకొంది. ఎట్టకేలకు బెయిల్‌ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కవితకు ఎందుకివ్వరు.?

కవిత తరుఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో సహ నిందితుడు మనీష్‌ సిసోడియాకు బెయిలు ఇచ్చారని. ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే చార్జిషీట్‌ దాఖలు అయ్యిందని పేర్కొన్నారు. దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు. 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారన్నారు. కవిత దుర్భల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్‌ అంశాలే కవితకూ వర్తిస్తాయని ముకుల్‌ రోహత్గీ తెలిపారు. కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్‌ చేశారని ఈడీ తరుఫు లాయర్‌ పేర్కొన్నారు. కవిత అసలు దర్యాప్తునకు సహకరించలేదన్నారు. ఫోన్లలో మెసేజ్‌లను డిలీట్‌ చేయడం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఫోన్‌లో డేటా ఎక్కువైనప్పుడు అరేజ్‌ చేసుకుంటాం కానీ ఫార్మాట్‌ చేయబోమని ఈడీ తరుఫు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు.

 వాడీవేడి వాదనలు.!

సాక్ష్యులను బెదిరించారని చెబుతున్నారని. కానీ ఎక్కడా ఏ కేసూ దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్‌ రోహత్గీ తెలిపారు. కవిత నిరక్షరాస్యులు కాదు. ఏది మంచి, ఏది చెడు కాదో తెలియదా? అప్రూవర్‌ అరుణ్‌ పిళ్లై ఎందుకు స్టేట్మెంట్‌ ఉపసంహరించుకున్నారు? అని జస్టిస్‌ గవాయి ప్రశ్నించారు. కవితకు సెక్షన్‌ 45 ఎందుకు వర్తించదని ఈడీ, సీబీఐ తరుఫు లాయర్లను జస్టిస్‌ గవాయ్‌ ప్రశ్నించారు. అరుణ్‌ పిళ్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు. కానీ ఆ సమయంలో పిళ్లై జైల్లో ఉన్నాడు. ఎలా ప్రభావితం చేస్తారు? అని ఈడీ తరుఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అవును. ఆ సమయంలో పిళ్లై జైల్లోనే ఉన్నారు. కానీ జైల్లో ఉన్నవారిని కూడా ప్రభావితం చేయవచ్చు. జైల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు. వారి ద్వారా ప్రభావితం చేయవచ్చు అని ఈడీ తరుఫు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు. సుప్రీంకోర్టులో కవిత బెయిల్‌ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్‌ఎస్‌ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ , ఎంపీ వద్దీరాజు రవిచంద్ర తదితర నేతలు హాజరయ్యారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....