న్యూఢిల్లీ, జూన్ 6 (ఇయ్యాల తెలంగాణ) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రదాని మోదీతో సమావేశం అయ్యారు. ఆయన వెంట సతీమణి అన్నా లెజ్ నోవా, కుమారుడు అకీరానందన్ ఉన్నారు. ఎన్డీఏ కూటమి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడే ఉన్నారు. మరోసారి శుక్రవారం ఎన్డీఏ కూటమి సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ సమయం ఇవ్వడంతో ఆయనతో మరోసారి సమావేశం అయ్యారు. కుటుంబాన్ని పరిచయం చేశారు. తన కుమారుడు అకీరాను కూ? ప్రధానితో భేటీకి తీసుకెళ్లారు. అకీరా ఇటీవల పవన్ కల్యాణ్‌తో ఎక్కువగా కనిపిస్తున్నారు. చంద్రబాబునాయుడుతో సమావశంలోనూ అకీరా కనిపించారు. సమావేశంలో కుమారుడ్ని ప్రధానికి పరిచయం చేశారు పవన్ కల్యాణ్. ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రెండు ఎంపీ సీట్లు ఉన్న జనసేన పార్టీ కూడా ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బుధవారం జరిగిన ఎన్డీఏ విూటింగ్‌లో కూడా పవన్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రధాని మోదీ నాయకత్వానికి మద్దతిస్తూ సంతకాలు కూడా చేశారు. మరోసారి శుక్రవారం ఎన్డీఏ సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి వర్గంలో జనసేన పార్టీకి కూడా చోటు దక్కుతుందని భావిస్తున్నారు.
- Homepage
- National News
- Modiని కలిసిన జనసేన అధినేత Pawan Kalyan
Modiని కలిసిన జనసేన అధినేత Pawan Kalyan
Leave a Comment