More ఫ్యామిలీ Drama.. More ధమాకా..

‘రానా నాయుడు సీజన్‌ 2’ ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన NETFLIX

ఫిక్సర్‌ మళ్లీ తిరిగొచ్చాడు.. అయితే ఈసారి తన కుటుంబం కోసం. 2023లో నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించిన సిరీస్‌ ‘రానా నాయుడు’ ఎంత పెద్ద ఆదరణను పొందిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘రానా నాయుడు సీజన్‌2’ మన ముందుకు రానుంది. గతసారి కంటే కఠినమైన, చీకటి పొరలను కలిగిన అంశాలు ఇందులో ఉండబోతున్నాయి. ఈసారి ఫిక్సర్‌ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. సాధారణంగా తన క్లైంట్స్‌ కోసం సమస్యలను సాల్వ్‌ చేసి రానా నాయుడు ఈసారి తన కుటుంబం కోసం రంగంలోకి దిగుతాడు. కుటుంబం ప్రమాదంలో ఉన్నప్పుడు నియమ నిబంధనలకు సంబంధిచిన హద్దులను అతను దాటుతాడు.

సీజన్‌1లో ప్రేక్షకులు రానా నాయుడు అనే అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లబడ్డారు. ధనవంతులు, దురాశపరులు చేసిన తప్పులను కప్పిపుచ్చే నైపుణ్యమున్న రానా నాయుడు, నేరాలను చెరిపేయగలడు, జీవితాలను తిరగ రాయగలడు, భయంకరమైన రహస్యాలను ఎవరికీ కనిపించకుండా దాచేయగలడు. ప్రపంచంలో ఎలాంటి పనినైనా చేయగల రానా, తన తండ్రిని మాత్రం ఎదుర్కొనలేడు. రానా నాయుడు తండ్రి నాగ నాయుడు కొడుక్కి దూరంగా ఉంటాడు. ఓ సందర్భంలో కొడుకు జీవితంలోకి నాగనాయుడు ప్రవేశించాల్సి వస్తుంది. ఎవరికీ తెలియని ఓ గతాన్ని మోసే టైం బాంబ్‌లాంటి వ్యక్తి నాగ నాయుడు. నాయుడు కుటుంబం ఏపనిని అసంపూర్తిగా చేయరు. ప్రమాదకరమైన వ్యక్తులు, గాయాలను భరిస్తున్నవారు. గతంలో జరిగిన తప్పులను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉంటారు.

సీజన్‌1 కంటే సీజన్‌2లో మరింత తీవ్రతరమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఈసారి వారు ఎదుర్కొనబోయే ప్రమాదం వారి వ్యక్తిగతమైనది. పాత గాయాలకు పగ తీర్చుకోవాలని గతం కోరుకుంటుంది. రవుఫ్‌` రానాకు సమానమైన శత్రువు. తన పగను తీర్చుకోవటానికి ఎలాంటి పనినైనా చేయటానికి వెనుకాడు. రానా చిట్టచివరగా ఓ ప్రమాదకరమైన పనిని ఫిక్స్‌ చేయాలని భావిస్తాడు. ఆ ప్రయత్నంలో అతను చివరి వరకు చేరుకుంటాడు. అది విజయవంతమైతే అతని కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. అయితే రౌఫ్‌ రూపంలో అనుకోని తుపాన్‌ ఎదురవుతుంది. ఇద్దరి మధ్య యుద్దం మొదలవుతుంది. సమయం పూర్తౌెపోతుంటుంది. దారులు మూసుకుపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లను రానా అదుపులోకి తెచ్చుకోగలడా?  లేక ఇబ్బంది పడతాడా?

సూర్వీన్‌ చావ్లా, కృతి ఖర్భందా, సుషాంత్‌ సింగ్‌, అభిషేక్‌ బెనర్జీ, మరియు డినో మోరియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సీజన్‌2లో ఆకట్టుకునే యాక్షన్‌, హై ఓల్టేజీ ఫ్యామిలీ డ్రామా ఉండనుంది. కుట్ర, విమోచనం ఇంకా వాటి మధ్య ఉండే బావోద్వేగాలను ఈ సీజన్‌లో మనం చూడొచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా, సిరీస్‌ హెడ్‌, తాన్యా బామి మాట్లాడుతూ ‘‘రానా నాయుడు సీజన్‌1 వచ్చిన రెండేళ్లలోనే మరోసారి యాక్షన్‌ డ్రామా ఫ్రాంచైజీతో ప్రేక్షకుల ముందుకు రావటం చాల ఎగ్జయిటింగ్‌గా ఉంది. సెలబ్రిటీల సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే వ్యక్తిగా సీజన్లో రానా మనకు కనిపించారు. అయితేజ సీజన్‌2లో మాత్రం తన కోసం, తన కుటుంబం కోసం పోరాడాల్సి వస్తుంది. శత్రువులతో చేసే యుద్ధంలో తనకు దగ్గరైన వాళ్లను రక్షించుకోవటానికి అతను నియమాలను దాటాల్సి వస్తుంది. రానా తన కుటుంబం విషయంలో ఏదైనా జరిగితే అస్సలు ఊరుకోడు. ఈసారి కథనం మరింత ఆసక్తికరంగా, యాక్షన్‌తో కలగలిపి ఉంటుంది. అలాగే అర్జున్‌ రాంపాల్‌ను కూడా ఈ టీమ్‌లోకి స్వాగతిస్తున్నాం. రానా దగ్గుబాటి, వెంకటేష్‌ దగ్గుబాటి తమదైన హాస్యాన్ని, హైదరాబాద్‌ శైలిని ఈ సీజన్లోకి తీసుకొచ్చారు. ఇన్‌టెన్స్‌ సన్నివేశాల్లో రానా తనదైన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటారు. సుందర్‌ అరోన్‌, కరణ్‌ అన్షుమన్‌, సుపర్ణ్‌ వర్మ, అభయ్‌ చోప్రాలతో కలిసి రానానాయుడు సీజన్‌2ను ప్రేక్షకుల ముందుకు జూన్‌13న తీసుకురావటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు.

కరణ్‌ అన్షుమన్‌ మాట్లాడుతూ ‘‘రానా నాయుడు సీజన్‌2, సీజన్‌1 కంటే పెద్దది. ఇన్‌టెన్స్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎమోషన్స్‌ ఇంకా ఎక్కువగా ఉంటాయి. రానా, నాగ ఇంకా తలపడుతూనే ఉంటారు. వీరిద్దరూ తన గతంతో, అందులో చేసిన తప్పుల కారణంగా ఇబ్బందులు పడి ధృడంగా మారినవారు. ఈసారి నాయుడు కుటుంబంలోని డ్రామా సరికొత్తగా ఉండనుంది. కోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. విశ్వాసాలు కనుమరుగవుతాయి. ప్రేమ, కుట్ర అనే రెండు అంశాల మధ్య ఉండే సన్నని గీత కనిపించకుండా పోనుంది. పరిస్థితులు ఇప్పటికే గందరగోళంగా ఉన్నాయనుకుంటే అర్జున్‌ రాంపాల్‌ రాకతో ఇవి ఇంకా కఠినంగా మారుతాయి. అన్నీ తలకింద్రులవుతాయి. అయితే రానా నాయుడు దృష్టంతా ఒక విషయంపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఏదైమైనా తన కుటుంబాన్ని కాపాడుకోవాలనేదే అతని లక్ష్యంగా ఉంటుంది’’ అన్నారు.

నిర్మాత సుందర్‌ అరోన్‌ మాట్లాడుతూ ‘‘రానా నాయుడు వంటి గమ్మత్తైన, హై ఓల్టేజ్‌ ప్రపంచంలోకి మళ్లీ రావటం అనేది ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉంది. సీజన్‌1కు వచ్చిన అద్భుతమైన స్పందన ప్రతీ కోణంలో సీజన్‌2కి శక్తినిచ్చింది. ఈ సీజన్‌లో గుండె బరువెక్కే భావోద్వేగాలతో పాటు, ఎన్నో మలుపులు తిరిగే డ్రామా కూడా ఉంటుంది. ఇవన్నీ బాంబ్‌లాగా, ముట్టుకుంటే పేలిపోయేలాంటి కథనంతో సీజన్‌2 ఉంటుంది. గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు కలయికతో సీజన్‌2ను ప్రేక్షకులను అందించటం ఎంతో గర్వంగా ఉంది. ఎంతో తీవ్రంగా ఉంటుందో, అంతే భావోద్వేంగానూ ఈసీజన్‌ ఉంటుంది’’ అన్నారు.

కరణ్‌ అన్షుమన్‌ క్రియేట్‌ చేసి దర్శకత్వం వహించటంతో పాటు సుపర్ణ్‌ వర్మ, అభయ్‌ చోప్రాలతో కలిసి తెరకెక్కించారు. సుందర్‌ అరోన్‌, లోకో మోటివ్‌ గ్లోబల్‌ నిర్మాణంలో రూపొందింది.  సీజన్‌1 ఎలాగైతే ప్రేక్షకులను ఆకట్టుకుందో, అదే విధంగా రానా నాయుడు సీజన్‌2 డబుల్‌ డ్రామా, డబుల్‌ ఎమోషన్స్‌, ఇన్‌టెన్స్‌ సన్నివేశాలతో ప్రేక్షకులను మరింత లోతుగా ఆలోచింప చేస్తాయి

I జూన్‌13న రానా నాయుడు సీజన్‌2 స్ట్రీమింగ్‌ కేవలం నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే

నెట్‌ఫ్లిక్స్‌ గురించి…

నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచంలోని అగ్రశ్రేణి వినోద ప్లాట్‌ఫార్మ్స్‌లో ఒకటి. ఇది 190 కంటే ఎక్కువ దేశాల్లో 300 మిలియన్లకుపైగా చెల్లింపు సభ్యత్వాలను కలిగి ఉంది. సబ్‌స్క్రైబర్స్‌ వివిధ భాషల్లో రూపొందిన టీవీ సిరీస్‌లు, సినిమాలు, గేమ్స్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. వీక్షకులు తమకు నచ్చినట్లు చూసేందుకు, మధ్యలో ఆపేందుకు లేదా మళ్లీ కొనసాగించేందుకు కావాల్సినంత స్వేచ్చ ఉంది.  అంతే కాకుండా వారు ఎప్పుడైనా, ఎక్కడైనా తమ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను ఎప్పుడైనా సులభంగా మార్చుకోవచ్చు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....