MP పై దాడిని ఖండిరచిన మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ): మెదక్‌ ఎంపీ ,దుబ్బాక బీ ఆర్‌ ఎస్‌ అభ్యర్థి  కొత్త ప్రభాకర్‌ రెడ్డి పై హత్యాయత్నాన్ని మంత్రి  టి .హరీష్‌ రావు తీవ్రంగా ఖండిరచారు. ప్రభాకర్‌ రెడ్డి పై దాడి అత్యంత గర్హనీయం ప్రజాస్వామ్యం లో హింస కు తావు లేదు .ఈ ఘటనను ప్రభుత్వం బీ ఆర్‌ ఎస్‌  పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభాకర్‌ రెడ్డి కి మెరుగైన చికిత్స  అందించేందుకు సికింద్రాబాద్‌ యశోధ ఆస్పత్రికి తరలించాం. ప్రభాకర్‌ రెడ్డి కి కత్తిపోటు తో  కడుపులో గాయాలయ్యాయి. ప్రభాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులు ,బీ ఆర్‌ ఎస్‌ కేడర్‌ ఎలాంటి  ఆందోళనలకు గురికావద్దు .అధైర్య పడవద్దు ప్రభాకర్‌ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ప్రభాకర్‌ రెడ్డి హత్యాయత్నం లో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనేకోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....