MP పై దాడిని ఖండిరచిన CM KCR భౌతిక దాడులకు ఆస్కారం లేదు

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):బీఆర్‌ఎస్‌ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్‌ ఎంపీ కొత్తా ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్‌ తీవ్రంగా ఖండిరచారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులు,హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం అన్నారు. ఎన్నికల సమయం లో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు బిఆర్‌ఎస్‌ నేతలకు కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్‌ నాయకులపై, కార్యకర్తలపై  ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని సీఎం అన్నారు.

నియోజకవర్గాల పర్యటనలో ఉన్న సీఎం, దుర్ఘటన పై మంత్రి హరీశ్‌ రావు ను సీఎం ఫోన్లోఆరా తీశారు.   కొత్త ప్రభాకర్‌ రెడ్డికి మెరుగైన చికత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....