MP మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు

 అనంతపురం అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ );సామాజిక సాధికార యాత్రలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో చంద్రబాబు ఛస్తాడని.. జగన్మోహన్‌ రెడ్డి సీఎం అవుతారని జోస్యమో.. మరొకటో కానీ చెప్పారు. ఇప్పటికే జైలులోనే చంద్రబాబును చంపేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, పలువురు టీడీపీ నేతలు పలు సందర్భాల్లో తెలి పారు. ఇప్పుడు చంద్రబాబు చస్తాడం టూ ఏకంగా వైసీపీ ఎంపీ అయిన గోరంట్ల మాధవ్‌ చేసిన వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.సామాజిక సాధి కార యాత్రలో గోరంట్ల మాధవ్‌ మాట్లా డుతూ.. చంద్రబాబు బస్సు యాత్ర చేసి.. జైలు యాత్ర చేస్తున్నాడన్నారు. పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర చేసి పారిపోయే యాత్ర చేస్తున్నారని విమర్శించారు. లోకేష్‌ పాదయాత్ర మొదలుపెట్టి పిల్లి యాత్ర చేస్తున్నాడ న్నారు. పవన్‌ వారాహి యాత్ర ఆపేసి ఢల్లీి చుట్టూ తిరుగుతున్నారన్నారు. లోకేష్‌ తన పాదయాత్ర చుట్టి పెట్టి పారిపోయాడని గోరంట్ల మాధవ్‌ వ్యాఖ్యానించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....