MRPS ఆధ్వర్యంలో బాబాసాహెబ్ జయంతి వేడుకలు

హైదరాబాద్, ఏప్రీల్ 14 (ఇయ్యాల తెలంగాణ) :  భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఛత్రినాక సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రసాద్ వర్మ పిలుపు నిచ్చారు. ఎం.ఆర్.పి.ఎస్ సీనియర్ నాయకులు బండి నరేష్ ఆధ్వర్యంలో ఛత్రినాక కూడలిలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్  జయంతి వేడుకలో ఛత్రినాక సీఐ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వర్మ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికై అంబెడ్కర్ నిరంతరం శ్రమించారని అన్నారు. ఆయన ఆశయాలు నేటి యువతరానికి ఆదర్శప్రాయమని అభిప్రాయ పడ్డారు. 

ఈ  సందర్భంగా  అనేక మంది వక్తలు అంబెడ్కర్ ఆశయాల గూర్చి వివరించారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ముక్కెర రమేష్,దార్ల యాదగిరి, సొసైటీ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ నాయకులు పార్వతి నరేష్, ఎం. ముత్యాలు, పి. మహేశ్వర్, వి. సురంజన్ తో పాటు వివిధ కుల సంఘాల పెద్దలు ఆర్. అర్జున్, అందె కృష్ణా రావు, వర్కాల సత్యనారాయణ, కె. భుజెందర్ అంబెడ్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....