సనత్ నగర్, ఆగష్టు 15 (ఇయ్యాల తెలంగాణ) : పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని సనత్ నగర్ నియోజక వర్గం పరిధిలోని పలు ప్రాంతాలల్లో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి ప్రజాలను అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో విశిష్ట సేవలు అందిస్తూ ఎం.ఆర్.పి.ఎస్ ఇతర అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న స్థానికంగా ఎన్నో సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తున్న MRPS రాష్ట్ర యువజన విభాగం సీనియర్ నాయకులు మల్లెల కిరణ్ కుమార్ ను అభినందించారు. అతనిని శాలువాతో సత్కరించారు. బీజేపీ సీనియర్ నాయకులు జి. అశోక్ యాదవ్, బీజేపీ మహంకాళి జిల్లా సెక్రటరీ పి. శంకర్ ముదిరాజ్, ఎం. కిట్టు యాదవ్, ఎం. విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Sanath Nagar News
- MRPS మల్లెల కిరణ్ కుమార్ ను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
MRPS మల్లెల కిరణ్ కుమార్ ను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Leave a Comment
Related Post