MY HOME సిమెంట్‌ లో ప్రమాదం

 
హైదరాబాద్‌, జూలై 25, (ఇయ్యాల తెలంగాణ ):సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మై హోం గ్రూపునకు చెందిన సిమెంట్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాధితులు ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు చెందినవారిగా సమాచారం. కర్మాగారంలోని యూనిట్‌`4 ప్లాంట్‌ వద్ద ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్‌ వర్క్‌ చేస్తుండగా లిఫ్ట్‌ కూలి కాంట్రాక్ట్‌ కార్మికులు కిందపడినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదం విషయంపై మై హోమ్‌ యాజమాన్యం గోప్యత పాటిస్తుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....