National Student పర్యావరణ కాంపిటీషన్ 2025 Poster ఆవిష్కరణ

హైదరాబాద్, జులై 01 (ఇయ్యాల తెలంగాణ) :  జిల్లాలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ NSPC 2025 పోస్టర్ ను  జిల్లా విద్యాశాఖ అధికారిని ఆర్ రోహిణి ఆవిష్కరించారు.   

 జిల్లా సైన్స్ అధికారి సి ధర్మేంద్రరావు, డిఈఓ ఆఫీస్ సుప్రింటెండెంట్ రాజేందర్, ప్రియదర్శిని ఎన్జీవో సుబ్బలక్ష్మి సన్నిహిత ఎన్జీవో ఉషారాణి తదితరులు కలిసి గోడపత్రికను ఆవిష్కరణ చేయడం జరిగింది , 

 ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారిని ఆర్. రోహిణి మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి రక్షణ కోసం విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం అత్యంత అవసరమని అన్నారు.  మొక్కలు నాటడం నీటి సంరక్షణ వ్యర్ధాల వేరు చేయడం వంటి పద్ధతులు ప్రతి విద్యార్థికి అలవాటవ్యాలి ని పేర్కొన్నారు ఈ పోటీని హరిత్ దా వే ఆఫ్ లైఫ్ అనే నినాదంతో పర్యావరణ సంరక్షణ ఉద్దేశంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అన్నారు జులై 1 నుంచి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయని కేంద్ర విద్యా పర్యావరణ మంత్రిత్వ శాఖల సహకార లో ఈ పోటీని నిర్వహిస్తున్నారని చెప్పారు ఫలితాలు ఆగస్టు 30న విడుదల చేస్తామన్నారు ,  పోటీ 5 విభాగాల్లో ఉంటుంది,  1వ తరగతి నుంచి 5వ తరగతి , 6వ తరగతి నుంచి 8వ తరగతి , 9వ తరగతి నుంచి 12వ తరగతి డిగ్రీ పీజీ పరిశోధన విద్యార్థులు ఇతర సాధారణ పౌరులు పోటీలో పాల్గొనడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం లేదు ఈ కో మిత్ర  https://ecomitram.app /nspc / అనే మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు ,

 హిందీ ఇంగ్లీష్ సహా అనేక భాషలలో క్విజ్ అందుబాటులో ఉంటుందని మొక్క నాటుతున్న నీరు సేవ్ చేస్తున్న లేదా వ్యర్ధాలను వేరు చేస్తున్న మీ సెల్ఫీని అప్లోడ్ చేయడం తప్పనిసరిగా ఉండాలన్నారు ప్రతి విద్యార్థికి పాల్గొనందుకు ఈ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందని ఉత్తమ ప్రదర్శన ఇచ్చినా విద్యా సంస్థలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు జిల్లాలోని అన్ని పాఠశాలలు కళాశాలలు ఈ పోటీలో పాల్గొనాలని   జిల్లా విద్యాశాఖ అధికారిని ఆర్ రోహిణి గారు తెలిపారు .

 జిల్లా సైన్స్ అధికారి శ్రీ ధర్మేంద్రరావు  మాట్లాడుతూ రేపటి నుంచి 52 రోజులు ప్రతిరోజు మీరు ఒక పర్యావరణ పనిలో పాల్గొని ఆ వివరాలు 4 వ్యాఖ్యలు ఒక ఫోటోతో పంపడానికి సిద్ధం కావాలి .

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....