NavaTarangini ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు !

హైదరాబాద్, ఏప్రిల్ 05 (ఇయ్యాల తెలంగాణ) : నవ తరంగిణి  సామజిక సంస్కృతిక యువజన సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సుల్తాన్ షాహిలోని అశోక్ పిల్లర్ ప్రాంతంలో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవ తరంగిణి అధ్యక్షులు ఎం. ప్రేమ్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో బిజెపి గోల్కొండ జిల్లా అధ్యక్షులు ఎం. కుమార్, బిజెపి రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పాశం సురేందర్ లు  ముఖ్య అథితిగా పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ ను వీడి జనతా పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎదిగిన విషయాన్నీ గుర్తు చేశారు. నిస్వార్థ సేవకునిగా పేద వర్గాలకు అనేక సేవలందించిన ఘనత దివంగత మహానేత డాక్టర్ బాబు జగ్ జీవన్ రామ్ అని కొనియాడారు. సమితి సభ్యులు ఒక్కక్కరుగా జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి ఫూల మాలలు  వేసి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమం లో బి. కరంజయ, పి.లక్ష్మణ్, చేతన్ కుమార్ సూరి, సునీల్ తివారి, డి. దేవానంద్, టి. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 

 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....