NCERT ప్యానల్‌ కమిటీ ప్రతిపాదనలపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఆగ్రహం

న్యూఢల్లీ అక్టోబర్ 25 (ఇయ్యాల తెలంగాణ ):దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్‌’గా మార్చాలంటూ ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ కు సంబంధించిన ప్యానల్‌ కమిటీ చేసిన ప్రతిపాదనలపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్‌, ఆర్జేడీ, శివసేన, డీఎంకే తదితర పార్టీ నేతలు బీజేపీ సర్కారు తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు.శివసేన (ఙుః వర్గం) ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ఇదో రాజకీయ నిర్ణయం అన్నారు. ఇండియా కూటమి ఏర్పాటైనప్పటి నుంచే బీజేపీ నేతలు దాన్ని ద్వేషించడం మొదలుపెట్టారని విమర్శించారు. ప్రభుత్వ విధానాలన్ని ఇండియా పేరుతో నడుస్తున్నప్పుడు ఇండియా అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో భారత్‌ అనే పదాన్ని చేర్చడానికి.. బీజేపీ సర్కారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాల్సిన అవసరం లేదా..? అని ప్రశ్నించారు.కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. వాళ్లు చాలా మార్పులు చేస్తున్నారని, పాఠ్య పుస్తకాల ద్వారా, పాఠ్యాంశాల ద్వారా, ఇలా ప్రతి అవకాశాన్ని వాడుకుని ఇండియా చరిత్రను రూపుమాపుతుండటం విూరు చూస్తున్నారని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇండియా, భారత్‌ రెండూ సమాన పదాలేనని, అలాంటప్పుడు ఇండియా అనే పదాన్ని తొలగించడం దేనికో అర్థం కావడం లేదని అన్నారు.డీఎంకే నేత ఇళంగోవన్‌ మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నందుకే కేంద్ర సర్కారు అంతటా ఆ పదాన్ని తొలగిస్తోందని ఆరోపించారు. ఇదొక చౌకబారు, అనవసర నిర్ణయమని వ్యాఖ్యానించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....