నేడు International మత్తు పదార్థాల వ్యతిరేక Day

అనేక కారణాల వల్ల మాదక ద్రవ్యాల వినియోగం విద్యార్థుల్లో, యువతలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. చాలామంది మద్యం, సిగరెట్లు, గంజాయి, కొకైన్‌ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. తద్వారా తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఆ మత్తులో చెడుమార్గంలో పయనిస్తూ ఇటు కుటుంబానికి, అటు సభ్య సమాజానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు. చిన్న వయస్సులోనే మత్తు పదార్థాలకు అలవాటుపడి చదువును పాటు చేసుకుంటున్నారు. ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువ జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు.

 ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 26న అంతర్జాతీయ అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక  దినోత్సవాన్ని జరుపుకుంటారు.

మత్తు పదార్ధాల వినియోగం వల్ల ఏర్పడు దుష్ఫలితాలు గురించి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్యోద్దేశ్యం.

ప్రపంచవ్యాప్తంగా ది యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ (యూఎన్‌ఓడిసి) ఈ రోజున మత్తు పదార్ధాల వల్ల ఏర్పడే సమస్యల పట్ల చైతన్యం కోసం అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ డిసెంబర్‌ 7, 1987న చేసిన తీర్మానం 42/112 ద్వారా ప్రతి సంవత్సరం జూన్‌ 26వ తేదీని అంతర్జాతీయ మత్తు పదార్ధాల వ్యతిరేక దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఈ తీర్మానం 1987 ఇంటర్నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ ఆన్‌ డ్రగ్‌ అబ్యూస్‌ అండ్‌ ఇల్లిసిట్‌ ట్రాఫికింగ్‌ నివేదిక ఇతర అంశాల పై మరికొన్ని చర్యల కోసం సిఫార్సు చేసింది.

1987 నుంచి ఐక్యరాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశ దేశాల ప్రభుత్వాలను ఈ మహమ్మారి వ్యాప్తి గురించి హెచ్చరిస్తోంది. మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా ప్రపంచమంతటా కార్యక్రమాలు జరుపుకోడానికి జూన్‌26వ తేదీన ఐరాస సర్వప్రతినిధి సభ 1987లో మొట్టమొదటిసారిగా తీర్మానించింది. మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా మానవాళిని రక్షించేందుకు, మాదకద్రవ్యాల వాడకం లేని సమాజాన్ని సృష్టించేందుకు గాను ప్రమాణం చేసే లక్ష్యంతో జూన్‌26ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా ఐరాస ప్రకటించింది. ప్రతి ఏటా జూన్‌26న ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాలను స్వాధీనపర్చుకుని దేశ దేశాల్లో బహిరంగంగా వాటిని తగులబెట్టడం, బహిరంగ సభలు, ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్యపర్చడం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం వంటి చర్యలను పెద్ద ఎత్తున ఐరాస ప్రోత్సహిస్తోంది..

టీనేజ్‌ పిల్లలు డ్రగ్స్‌ వైపు మొగ్గు చూపటంలో ప్రధానంగా నెగెటివ్‌ కుటుంబ వాతావరణం కూడా ఒక ముఖ్యకారణం. తల్లిదండ్రులు ఘర్షణతో ఉన్నా, పిల్లలతో మంచి అనుబంధం ఏర్పర్చుకోకపోయినా, ఆత్మీయంగా వారితో సమయం గడపకపోయినా ‘మనం పట్టని తల్లిదండ్రుల’ కంటే ‘మనకు కిక్‌ ఇచ్చే డ్రగ్స్‌ మేలు’ అనే భావనలో భ్రష్ట సాంగత్యాల్లోకి పిల్లలు వెళ్తుంటారు. చదువుతోపాటు క్రీడలు, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, బంధుమిత్రులు, క్రమశిక్షణల ఆర్థిక పరిస్థితి, భావోద్వేగాలకు అయిన వారు ఉన్నారన్న భరోసా, విలువలు ఏదో ఒక ఆత్మీయ ఆలంబన వంటివి టీనేజ్‌ పిల్లల రోజువారీ జీవనంలో ఉంటే వారు డ్రగ్స్‌ బారిన ఏమాత్రం పడరు. సరదా షికార్లు, స్లీప్‌ ఓవర్‌ల సమయంలో సరదా కొద్దీ సీనియర్లో, స్నేహితులో డ్రగ్స్‌ ఇస్తుంటారు. ఇవి తీసుకున్నాక ఇంకా ఎన్ని రకాల డ్రగ్స్‌ ఉన్నాయో వెతుకులాట సాగిస్తారు. ఇక అంతటితో వారి చదువు, ఆరోగ్యం, ఏకాగ్రత, వ్యక్తిత్వం మొత్తం ధ్వంసమైపోతాయి. తల్లిదండ్రులు మందలిస్తే ‘విూరిలా తిడితే ఇల్లు విడిచివెళ్లిపోతాం’ అంటూ బ్లాక్‌మెయిల్‌ కూడా చేస్తుంటారు. వీరిని చాలా ఓర్పుతో థెరపీల ద్వారా తిరిగి మామూలు మనుషులుగా చేయాల్సి వుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....