Next Year – మార్చిలోపు Delhi లో భవన నిర్మాణం

తెలంగాణ భవన్‌ నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివ్యూ

న్యూ డిల్లీ  డిసెంబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ) : ఢిల్లీ లో తెలంగాణ భవన్‌ నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం రివ్యూ నిర్వహించారు. 19 ఎకరాల ఉమ్మడి ఏపీ భూమిలో తెలంగాణ భవన్‌ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. వాటితోపాటు గోదావరి బ్లాక్‌, స్వర్ణముఖి బ్లాక్‌, నర్సింగ్‌ హాస్పిటల్‌, పటౌడీ గ్రాండ్‌ను పరిశీలించారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం ఢల్లీిలో సీఎం రేవంత్‌ రెడ్డి కి వివరిస్తానని వెల్లడిరచారు. ఇప్పటికే ఢల్లీిలో తెలంగాణ భవన్‌ నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోపు భవన నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడిరచారు. ఉమ్మడి భవన్‌ ఆస్తుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం లేదన్నారు. డిజైన్లు ఖరారు చేసి, టెండర్లు పిలిచి ఏప్రిల్‌ నాటికి తెలంగాణ భవన్‌ నిర్మాణ పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....