Night 12 గంటల నుంచి పెరుగనున్న రీచార్జీ ధరలు

న్యూఢిల్లీ, జూలై 2 (ఇయ్యాల తెలంగాణ) :  దేశంలో  జియో, ఎయిర్‌ టెల్‌ వంటి టెలికామ్‌ దిగ్గజ టెలికామ్‌ కంపెనీలు ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి రీచార్జీ ధరలు పెంచేస్తున్నాయి. కానీ విూరు ఇప్పుడు రీచార్జీ చేస్తే పెరిగే ధరల భారం నుంచి తప్పించుకోవచ్చు. విూ ప్లాన్‌ యాక్టివ్‌ గా ఉన్నా సరే నేటి రాత్రి 12.00 గంటల లోపు ఎప్పుడైనా రీచార్జీ చేసుకోండి. జియో, ఎయిర్‌ టెల్‌ యూజర్లకు అడ్వాన్స్‌ గా రీచార్జ్‌ చేసుకునే వెసలు బాటు ఉంది. మిగతా వారికి ఈ అవకాశం లేదన్న విషయం గుర్తుంచుకోండి.జియో సబ్స్రయిబర్లు ఏ ప్లాన్‌ అయినా ముందుగానే రీచార్జ్‌ చేయవచ్చు, కానీ ఎయిర్‌ టెల్‌ సబ్స్రయిబర్లు మాత్రం ప్రస్తుతం యాక్టివ్‌ గా ఉన్న ప్లాన్‌ తోనే రీచార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. వొడాఫోన్‌`ఐడియా యూజర్లు ఇలా ముందుగా రీచార్జ్‌ చేసుకోలేరు, వారు మాత్రం భారాన్ని భరించాల్సిందే.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....