NIMSలో ఈ నెల 24 నుంచి 30 వరకు చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు

 సెప్టెంబర్‌ 22 (ఇయ్యాల తెలంగాణ ); చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఈ నెల 24 నుంచి 30 వరకు నిమ్స్‌ మిలీనియం బ్లాక్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్‌ బీరప్ప తెలిపారు. బ్రిటన్‌ డాక్టర్‌ రమణ దన్నపునేని ఆధ్వర్యంలో పది మంది వైద్య బృందంతో పాటు నిమ్స్‌ కార్డియో థోరాసిక్‌ విభాగాధిపతి అమరేశ్వరరావు, వైద్య బృందం, నిలోఫర్‌ ఆస్పత్రి వైద్యులు సర్జరీలలో పాల్గొంటారని పేర్కొన్నారు.నవజాత శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు గుండెలో రంధ్రం, గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారని వివరించారు. వివరాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోపు 040`23489025 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....