న్యూ డిల్లీ సెప్టెంబర్ 17 (ఇయ్యాల తెలంగాణ ): కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతున్నది. ఆ రాష్ట్రంలో ఆరు నిపా కేసులు వెలుగుచూడగా అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో నిపా వైరస్‌లో బంగ్లాదేశ్ స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ కు చెందిన మాజీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రమణ్ గంగాఖేద్కర్ చెప్పారు.బంగ్లాదేశ్ స్ట్రెయిన్ సోకిన ప్రతి 10 మందిలో 9 మంది మరణించే అవకాశం ఉందని రమణ్ తెలిపారు. ఈ స్ట్రెయిన్ ఊపిరితిత్తులపై తీవ్రంగా పనిచేసి ఊపిరాడకుండా చేస్తుందని, దాంతో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. టాప్ ఎపిడమియాలజిస్ట్ అయిన ఖేద్కర్.. గత మూడు దశాబ్దాలుగా అంటు వ్యాధుల నిర్మూలన కోసం భారత్ చేస్తున్న పోరాటంలో కీలక పాత్ర పోషించారు.కాగా, కేరళలో విస్తరిస్తతున్నది నిపా వైరస్‌లోని బంగ్లాదేశ్ స్ట్రెయినేనని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ఈ నెల 13న ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరు కేసులు నమోదయ్యాయని, వారిలో ఇద్దరు మరణించారని ఆమె తెలిపారు.