హైదరాబాద్ సెప్టెంబర్ 20 (ఇయ్యాల తెలంగాణ ); రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అక్టోబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈసీఐకి చెందిన సీనియర్ అధికారులు సుమారు మూడు రోజులు పాటు తెలంగాణలో ఎన్నికల సంసిద్ధతపై అంచనాలు చేయనున్నారు. రాజకీయ పార్టీలు, సెక్యూర్టీ దళాలు, స్థానికులతో పాటు ఇతర స్టేక్‌హోల్డర్స్‌తో ఎన్నికల సంఘం అధికారులు చర్చించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం సవిూపిస్తున్న నేపథ్యంలో.. ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని ఈసీఐ అంచనా వేయనున్నది.2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై అక్టోబర్ ఆరో తేదీన ఈసీ ప్రకటన చేసింది. నవంబర్ 12న నోటీఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. ప్రస్తుత అసెంబ్లీ కాలం జనవరి 17వ తేదీన ముగియనున్నది. ఎన్నికల నిర్వహణకు చెందిన అన్ని అంశాలను ఈసీ బృందం పర్యవేక్షించనున్నది. కొన్ని పనులు పూర్తి చేయడానికి వాళ్లు డెడ్‌లైన్ విధించే అవకాశాలు ఉన్నాయి
- Homepage
- National New
- OCTOBER 3వ తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ELECTION COMMISSON
OCTOBER 3వ తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ELECTION COMMISSON
Leave a Comment
Related Post