ఒకరు చెబితే నిర్ణయం తీసుకునే పార్టీ BJP కాదు

దళితుడికి సీఎం ఇస్తానని మాట తప్పిన బీఆర్‌ఎస్‌ కు బీజేపీకి గురించి మాట్లాడే హక్కు లేదు,

చేతనైతే కేసీఆర్‌ తప్పుకుని బీసీకి బీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా?

బీసీకి అధ్యక్ష పదవి గురించి అడిగే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ కు లేదు,

ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ. దేశంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ. సిద్దాంతం కోసం కమిట్‌ మెంట్‌ తో పనిచేసే లక్షలాది కట్టర్‌ కార్యకర్తలున్న పార్టీ బీజేపీ. అంత గొప్ప చరిత్ర కలిగిన బీజేపీ ఒకరు చెబితేనే, ఇంకొకరు ఒత్తిడి తెస్తేనో తలొగ్గి నిర్ణయం తీసుకునే పార్టీ బీజేపీ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి, అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. రామచంద్రరావు పేరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఖరారు చేయడం వెనుక చంద్రబాబు కీలక పాత్ర పోషించారంటూ సోషల్‌ విూడియాలో జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బండి సంజయ్‌ పైవిధంగా స్పందించారు. ఇది కావాలని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారమన్నారు. అట్లాంటి వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బీజేపీలోనూ కొందరు ఇలాంటి ప్రచారమే చేస్తున్నారంటూ విూడియా ప్రస్తావించగా, బీజేపీలో అట్లాంటివి జరగవు. ఇట్లాంటి పోకడలను ఇప్పడే చూస్తున్నా ఇది కరెక్ట్‌ కాదు. బండి సంజయ్‌ ఉంటేనే పార్టీ  ఉన్నట్లు, లేకపోతే పార్టీయే లేనట్లు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎవరు లేకపోయినా పార్టీ నడస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు స్వీకరిస్తున్న నేపథ్యంలో బండి సంజయ్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన బండి సంజయ్‌ ను ఈ అంశంతోపాటు విూడియా అడిగిన పలు ప్రశ్నలకు బండి సంజయ్‌ కుండ బద్దలు కొట్టినట్లుగా సమాధానమిచ్చారు. ఏమన్నరంటే..

రాష్ట్ర అధ్యక్ష పదవిపై

జాతీయ నాయకత్వం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటించలేదు. పదవి కోసం ఎవరైనా నామినేషన్‌ వేసే అవకాశముంది. అధ్యక్షుడు కావాలని కోరుకోవడంలో కూడా తప్పులేదు. కానీ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని పార్టీ ప్రయోజనాలను ద్రుష్టిలో ఉంచుకుని హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుంది. దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్‌ మెంట్‌ తో పనిచేసే ప్రతి కార్యకర్తపై ఉంది. ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలో హైకమాండ్‌ నిర్ణయిస్తది. అధ్యక్ష పదవి రానంత మాత్రాన మిగితా వాళ్లు డవ్మిూ అనుకోవడం కూడా సరికాదు.

చంద్రబాబు చెబితేనే రామచంద్రరావుకు పదవి ఇచ్చారనే ప్రచారంపై..

అవన్నీ ఫాల్త్‌ మాటలు. సోషల్‌ విూడియాలో కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య ఇట్లాంటి కొత్త పోకడలు కన్పిస్తున్నాయి. ఇది కరెక్ట్‌ కాదు. చంద్రబాబు చెబితే వినే పార్టీ బీజేపీ కాదు. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వమున్న పార్టీ. దేశంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టర్‌ కార్యకర్తలున్న పార్టీ బీజేపీ. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నిర్ణయించిన అభ్యర్ధికి వ్యతిరేకంగా విూడియా, సోషల్‌ విూడియాలో ప్రచారం చేస్తే హైకమాండ్‌ సీరియస్‌ గా చర్యలు తీసుకుంటుంది. బండి సంజయ్‌ ఉంటేనే పార్టీ  ఉన్నట్లు. లేకపోతే పార్టీయే లేనట్లు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎవరు లేకపోయినా పార్టీ నడస్తుంది.

డవ్మిూ అని ప్రచారం చేస్తే చర్యలు తప్పవ్‌

మోదీ నాయకత్వంలో బీజేపీ కచ్చితంగా తెలంగాణ అధికారంలోకి రావడం తథ్యం. కట్టర్‌ కార్యకర్తలంతా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అంతే తప్ప ఆయన డవ్మిూ ఈయన డవ్మిూ అని దుష్ప్రచారం చేస్తే ఎవరూ పట్టించుకోరు.

బీసీకి అధ్యక్ష పదవి ఎందుకివ్వలేదనే ప్రశ్నపై

అంతేందుకు బీసీకి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్న బీఆర్‌ఎస్‌ ను అడుగుతున్నా  కేసీఆర్‌ దిగి బీసీకి బీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా? దళితుడికి సీఎం ఇస్తా, లేకుంటే తల నరక్కుంటానని హావిూ ఇచ్చి మాట తప్పిన నాయకుడు కేసీఆర్‌. బీజేపీ భాజాప్తా ఒక్కటే మాట చెప్పింది. అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతారని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం ఆ విషయం చూసుకుంటుంది. కానీ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు కదా? పార్టీ బలోపేతం కోసం అనేక రకాలుగా ఆలోచించి నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. బీసీల్లో నాకు కేంద్ర పదవి ఇవ్వలేదా, లక్ష్మణ్‌ కు ఇవ్వలేదా, దత్తాత్రేయకు ఇవ్వలేదా? దళితుడైన బంగారు లక్ష్మణ్‌ కు పదవి ఇవ్వలేదా?  దళితుడికి సీఎం ఇస్తానని మాట తప్పి వేల కోట్లు దోచుకున్న పార్టీ బీఆర్‌ఎస్‌.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....