Old Cityలో దంచి కొడుతున్న వర్షం !

 

హైదరాబాద్, ఏప్రీల్ 18 (ఇయ్యాల తెలంగాణ) : పాతనగరంలో వర్షం దంచి కొడుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం కాస్త  సాయంత్రం 4 గంటల తరువాత ఒక్కసారిగా చల్ల బడింది. వర్షం సూచనలు కనిపిస్తోన్న, వర్ష సూచనలు అంతగా లేవనే వెదర్ రిపోర్ట్ సూచించింది. కానీ ఆ సూచనలకు వ్యతిరేకంగా వర్షం దంచి కొట్టింది.  ఎప్పటిలాగే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి . ఉరుములతో కూడిన వర్షం ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లనీ కాలువలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఛత్రినాక, లలితా బాగ్, ఉప్పుగూడ , భవానీ నగర్, ఫలక్ నుమా ప్రాంతాల్లో రోడ్లన్నీ వర్షం నీటి తో నిండి పోయాయి. సాయంత్రం వేల అప్పుడప్పుడే బయటకు వెళ్లిన ప్రయాణీకులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....