Old City కి Metro ఎప్పుడు ?

హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ఇయ్యాల తెలంగాణ) :  అదిగో ప్రణాళిక ఇక పనులు జరగడమే తరువాయి?  వచ్చేస్తోంది ? మెట్రో పాతనగరానికి అంటూ ఒక పక్క రాజకీయ పార్టీలు మరో పక్క అధికారులు ప్రగల్బాలు పలుకుతున్నా పాతబస్తీకి మెట్రో సౌకర్యం ఎప్పుడు వస్తుందా ? అని ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూపులు చూస్తున్నారు. నిత్యం వేలమంది  జనాలు అనేక అవసరాల నిమిత్తం నగరానికే వెళుతూ ఉంటారు. పిల్లల కాలేజీలు, ఉద్యోగం, వ్యాపారం, ఇంకా ఎలాంటి పనులకు వెళ్లాలన్నా నగరానికే ఎక్కువగా వెళ్లడం చూస్తూనే ఉంటాం.  అటువంటి పాతబస్తీకి మెట్రో రావడం అనేది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తతంగం, అసలు ఎప్పుడు వస్తుందా ? అని ప్రజలు ఊవిళ్లూరే పరిస్థితులు ?  నగరంలో కొత్త కొత్త సిటీలు ఏర్పాటై అక్కడి జనాలు స్థిర పడడంతో పాటు వారి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వాలు సకల హంగులతో కూడిన సదుపాయాలు కల్పించడంతో పాటు రింగ్ రోడ్ల నిర్మాణం, మెట్రో సౌకర్యాల కల్పన చక చకా జరిగిపోతున్నాయి. కానీ తాతల చరిత్ర కలిగిన పాతనగరానికి మాత్రం రింగ్ రోడ్లు కాదు కదా మెట్రో సౌకర్యం వచ్చేస్తుందంటే అవునా వస్తోందా ? ఇంకెప్పుడు అనే పరిస్థితులు లేక పోలేదు. ప్రభుత్వాలు మారినా మెట్రో రాక జాడ ఎక్కడ అన్న చందంగా తయారైంది పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో పాతనగరం వైపు మెట్రో సౌకర్యం లాంటి పనులపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? లేక మాట వరుసలకే ఊరిస్తుందా ? అనే అనుమానం తలెత్తుతోంది. ఇటీవలే కొత్తగా మెట్రో ఏర్పాటుకు ఫలక్ నుమా వరకు ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం అధికారులు మళ్లీ  ఈ ప్రస్తావనను ముందుకు తీసుకు పోయే పనిలో కానరావడం లేదు. 

పార్లమెంట్ ఎన్నికల తరువాత పాతబస్తీ మెట్రో గురుంచి చర్చలు జరుపుదామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పార్లమెంట్ స్థానాల్లో లెక్కలు వేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. హై కమాండ్ నుంచి కూడా పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక టార్గెట్ లను అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఎన్నికలు అయిపోగానే బడ్జెట్ పై ప్రణాళికలు సిద్ధం చేసుకునే స్థితి గతుల్లో ప్రభుత్వాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే పాతబస్తీకి మెట్రో గురించి ప్రణాళికలు వేసే ప్రక్రియ ఇంకా ఎంత కాలం వేచి ఉండాలనే ఆలోచనతోనే సరిపోతుంది. నగరాలు మారుతున్నాయి. కొత్త కొత్త నగరాలూ పుట్టొకొస్తున్నాయి. ఎక్కడికక్కడ కొత్త కొత్త నిర్మాణాలు, ప్రాణాళికలు రూపుదిద్దుకొంటున్నాయి. కానీ పాతనగరంలో మెట్రో నిర్మాణం పనులు మాత్రం ఎప్పుడెప్పుడా ? అనే దోరణితో ఉన్నట్లు కనిపిస్తోంది. పిల్లలు పెద్దగా అవుతున్నారు. వారు ఉద్యోగంలో స్థిర పడిపోతున్నారు. చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారంతా నగరానికి వెళ్లి అక్క్కడక్కడ స్థిర పడిపోతున్నారు. ఒక తరం గడిచి మరో తరం వస్తోంది. మల్లీ వాళ్ళ పిల్లలు పెద్దవాళ్లయ్యారు. పెళ్లిళ్లు జరిగాయి. వాళ్లకు పిల్లలు పుట్టారు. ఇంకా ఎదురు చూపులే మెట్రో ఎప్పుడొస్తుందా ? మా పాతబస్తీకి మెట్రో ఎప్పుడా అని ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఇంకా ఎంత కాలం పడుతుందో వేచి చూద్దాం …..       

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....