Old City ఛత్రినాకలో మాజీ ప్రియురాలిపై కత్తితో దాడి ! పోలీసుల అదుపులో ప్రియుడు

హైదరాబాద్‌, జూన్ 18 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ లోని ఛత్రినాకలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమ నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిపై దాడి చేశాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేసి, కత్తితో గొంతు కోశాడు. యువతి అరుపులతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకు రాగా.. నిందితుడు పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువతిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల వివరాలు, సీసీటీవీ కెమెరాల ఫుటేజీల సాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు.. ఘటనా స్థలానికి దగ్గర్లోనే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, యువతికి ఇప్పటికే పెళ్లి అయిందని, భర్తతో విడాకులు తీసుకుని తల్లితో కలిసి ఉంటోందని చుట్టుపక్కల వారు చెప్పారు. ఉదయమే తల్లి షాపుకు వెళ్లగా.. బాధితురాలు ఆఫీసుకు వెళ్లేందుకు తయారవుతోందని వివరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....