Old City ఛత్రినాక ఫైర్ ఆక్సిడెంట్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి !

 హైదరాబాద్, మే 20 (ఇయ్యాల తెలంగాణ) :  ఓల్డ్ సిటీ ఛత్రినాక ప్రాంతంలో ఈ రోజు జరిగిన ఫైర్ ఆక్సిడెంట్ లో నష్టపోయిన బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని ఎస్సీ డెవలప్ మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పులికంటి నరేష్ ఒక ప్రకటనలో కోరారు. బాధిత  కుటుంబానికి వృత్తి ఆధారమైన చెప్పుల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారని హఠాత్తుగా జరిగిన ప్రమాదం వల్ల బాధిత కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా నష్ట పోయినట్లు నరేష్ తెలిపారు. తమ వృత్తినే నమ్ముకొని బ్రతుకుతున్న బాధిత కుటుంబానికి హఠాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదం ఆర్థికంగా వారు క్రుంగి పోయేలా చేసిందని రోజువారీ వృత్తి తోనే జీవనాన్ని ముందుకు సాగించే కుటుంబానికి ఎస్సీ డెవలప్ మెంట్ సొసైటీ అన్నివిధాలా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తక్షణమే ప్రభుత్వం తరపున నష్ట పరిహారం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని పులికంటి నరేష్ కోరారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....