One Day తర్వాత కుడా ఆదే ఫుడ్డు

     👉 ఒక రోజు తర్వాత కుడా ఆదే ఫుడ్డు

     👉 మెన్యూను తుంగలో తొక్కిన కాంట్రాక్టర్‌

     👉 తాండూర్‌ నెం1 స్కూల్‌ లో విద్యార్దుల వెతలు

వికారాబాద్‌, ఫిబ్రవరి 4 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి చదువుకుంటున్న విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల అల్పాహారం పథకాన్ని ప్రభుత్వం  ప్రారంభించిన జరిగింది. అయితే ఈ అల్పాహారాన్ని పథకాన్ని అదునుగా చేసుకున్న అల్పాహార కాంట్రాక్టర్లు తన అల్పబుద్ధి   ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. విద్యార్థులు ఏమి చూడలే ఏదో ఒకటి తింటారు అనుకుంటూ  రోజు ఉన్న మెన్యు లో సాంబార్‌ కు బదులు పొంగల్‌ సాంబార్‌ ను పంపిణీ చేశారు. దీంతో వాసన రావడంతో విద్యార్థులు అల్పాహారం తినక వెనుతిరిగి పోయారు.  ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ నంబర్‌ వన్‌ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది..

శుక్రవారం ఉదయం తాండూర్‌ ప్రభుత్వ పాఠశాల నంబర్‌ వన్‌ పాఠశాల లో ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి  మెన్యు ప్రకారం పొంగల్‌ రైస్‌ ఉంది దీంతో నిన్నటి పొంగల్‌ రైస్‌ లో కొంతమంది విద్యార్థులే అల్పాహారం తిన్నారు. తీరా ఆ పొంగల్‌ రైస్‌ మిగిలిపోయింది. నేడు ఆ పొంగల్‌ రైస్‌ ను విద్యార్థులకు అందించే మెన్యు ప్రకారం ఇడ్లీ సాంబార్‌ ఈరోజు ఉండగా సాంబార్‌ కు బదులు నిన్నటి పొంగల్‌ రైస్‌ లో కొద్దిగా నీరు పోసి సాంబార్‌ గా పంపించారు. ఈరోజు ఉదయం అల్పాహారానికి వచ్చిన విద్యార్థులు అల్పాహారం తీసుకునే సందర్భంలో సాంబార్లో అన్నం, వాసన రావడంతో విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఉపాధ్యాయులు పరిశీలించగా సాంబార్లో మొత్తం పొంగల్‌ రైస్‌ కనిపించింది. మరోవైపు వాసన రావడంతో విద్యార్థులు అల్పాహారం తినక తిరస్కరించారు. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంబార్‌ లో అన్నం రైస్‌ రావడం వాసన ఉండడంతో తాము తినలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....