సికింద్రాబాద్, మార్చి 01 (ఇయ్యాల తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల రూమ్ నెంబర్ 57 లో ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆదుకున్నదో, అమరులకు విలువనివ్వడానికి అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశారో అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అసువులు బాసిన అమరులైన మాదిగ అమరుల కుటుంబాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని మందకృష్ణ మాదిగ కోరారు. అమరవీరులను స్మరించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్తూపంతో పాటు మ్యూజియంను ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం అనేది న్యాయమైన పోరాటం కాబట్టే అన్ని రాజకీయ వర్గాలు సమర్ధించాయని తెలిపారు. గతంలో నియమించబడ్డ కమిషన్లు అన్ని వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డాయని అన్నారు అన్ని రాజకీయ పక్షాలతో పాటు దళితుల్లో 59 కులాల్లో 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. సమాజంలో ఉండే అన్ని వర్గాలు వర్గీకరణ ఉద్యమాన్ని బలపరిచాయన్నారు.
- Homepage
- Telangana News
- OU లో “మాదిగ” అమరవీరుల సంస్మరణ సభ
OU లో “మాదిగ” అమరవీరుల సంస్మరణ సభ
Leave a Comment