Pakistan లో మరోసారి చెలరేగిపోయిన ఉగ్రవాదులు !

👉 జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు హైజాక్‌

👉 ముందుగా ట్రాక్‌ను పేల్చేసిన ఉగ్రవాదులు..ఆ తర్వాత రైలుపై కాల్పులు

👉 ఈ దాడిలో ఆరుగురు మిలిటరీ సిబ్బంది మృతి

బలోచిస్థాన్‌, మార్చి 11 : 

 పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. బలోచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కి వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును హైజాక్‌ చేశారు. హైజాక్‌ చేసిన సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దాడికి వేర్పాటువాద సంస్థ బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ(బిఎల్‌ఎ) బాధ్యత తీసుకుంది.ముందుగా ట్రాక్‌ను పేల్చేసిన ఉగ్రవాదులు ఆ తర్వాత రైలుపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆరుగురు మిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు బిఎల్‌ఎ వెల్లడిరచింది. ఆ తర్వాత రైలును తమ నియంత్రణలోకి తీసుకుంది. ప్రయాణికులతో పాటు కొందరు భద్రతా సిబ్బంది కూడా రైలులో ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్నారు. ఎలాంటి మిలిటరీ ఆపరేషన్‌కు ప్రయత్నించినా.. అందరిని చంపేస్తామని ఉగ్రవాదులు హెచ్చరించారు. సహాయక, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....