PAN లేకుండా నగదు బట్వాడా.. బ్యాంకులకు కొత్త నిబంధన


పెరంబూర్‌ అక్టోబర్‌ 26 (ఇయ్యాల తెలంగాణ ): పాన్‌కార్డు లేని వారి నుంచి, స్వీయ వివరాలు సేకరించిన తర్వాతే నగదు పరివర్తనకు అనుమతించాలని బ్యాంకులకు ఆదాయపన్ను శాఖ తెలియజేసింది. ఒకసారి రూ.50 వేలు, అంతకు పైగా నగదు పరివర్తన చేపట్టే వారి నుంచి పాన్‌ కార్డు నెంబరు స్వీకరించి బ్యాంకు ఉద్యోగులు నగదు బట్వాడా చేపడుతున్నారు. అదే సమయంలో రూ.50 వేలకు పైగా నేరుగా నగదు బట్వాడా చేయవద్దనే ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. ఈ క్రమంలో, పలు బ్యాంకులు తమ వినియోగదారుల నుంచి పాన్‌ లేకుండా రూ.50 వేలకు పైగా నగదు నేరుగా బట్వాడా చేస్తున్నాయి. ఈ విషయంపై దృష్టి సారించిన ఆదాయపన్ను శాఖ, పాన్‌ లేని వినియోగదారుల ఆధార్‌ నెంబరు, బ్యాంక్‌ ఖాతా నెంబరు, చిరునామా, రిజిస్టర్‌ మొబైల్‌ నెంబరు తదితర స్వీయ వివరాలు సేకరించిన తర్వాతే నేరుగా నగదు బట్వాడాకు అనుమతించవచ్చని పేర్కొంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....