PARAKALA లో పాగా వేసేందుకు వ్యూహం

వరంగల్‌, ఆగస్టు 29, (ఇయ్యాల తెలంగాణ );పరకాల నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌. ఈసారి ఇక్కడ పార్టీని గెలిపించి తన పంతం నెగ్గించుకోవాలని కసిగా ఉన్నారాయన. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ చల్లా ధర్మారెడ్డికి చెక్‌ పెట్టేందుకు కొత్త అభ్యర్థిని బరిలో దింపడానికి గ్రౌండ్‌ ప్రిపేర్‌ అయిపోయినట్టు తెలిసింది. స్థానికంగా పేరున్న డాక్టర్‌ కాళిప్రసాద్‌ బీజేపీకి దగ్గరయ్యారు. స్థానికుడైన కాళీప్రసాద్‌ వైద్యవృత్తితో నియోజకవర్గ ప్రజలకు చిర పరిచితుడే. పైగా సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఇది పార్టీకి ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారట ఈటల. హుజురాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈటల ఓటమికోసం విశ్వప్రయత్నాలు చేశారనే ప్రచారం ఉంది.ఈసారి దీటైన అభ్యర్థిగా కాళీ ప్రసాద్‌ను రంగంలోకి దింపి రివెంజ్‌ తీర్చుకోవాలనుకుంటున్నారట ఈటల. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి సైతం కాళీప్రసాద్‌ రాకను స్వాగతిస్తున్నారు. తన ఇమేజికి తోడు పరకాల పట్టణంలో బీజేపీకి మంచి పట్టు ఉండడంతోపాటు, బడుగు బలహీనవర్గాల ఓట్లు ఎక్కువగా ఉండడం కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారట కాళీ ప్రసాద్‌. మున్నూరు కాపు అయిన డాక్టర్‌కు కొండా సురేఖ`మురళీ దంపతుల సహకారం సైతం అందుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొండా దంపతులకు రాజకీయ ప్రత్యర్థి అయిన చల్లాను ఓడిరచేందుకు డాక్టర్‌కు వాళ్ళ సహకారం ఉంటుందన్నది స్థానిక అంచనా. పరకాల నియోజకవర్గంలో పరకాల, నడికూడ, ఆత్మకూరు, సంగెం, దామెర మండలాలు ఉండగా ? మొత్తం ఓటర్లు 2లక్షల 11వేల 660 మంది. అందులో ప్రధానంగా బీసీ సామాజికవర్గాలకు చెందిన ఓట్లు సుమారు 60శాతం ఉన్నాయి. ముదిరాజ్‌ల ఓట్లు 31వేలు, మున్నూరు కాపుల ఓట్లు 32వేలు, గౌడ్స్‌ 25వేలు, యాదవులకు 22వేలు, పద్మశాలీలకు 15వేలకు పైగా ఓటు బ్యాంకు ఉంది.ఈటల రాజేందర్‌ మాటకు ముదిరాజ్‌ సామాజికవర్గం కట్టుబడి ఉంటుందని, అదే సమయంలో సొంత సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్న నమ్మకంతో డాక్టర్‌ కాళీప్రసాద్‌ ఉన్నారు. మొత్తం విూద అధికారికంగా ప్రకటించకున్నా? పరకాల బీజేపీ అభ్యర్థిగా డాక్టర్‌ కాళీ ప్రసాద్‌ ఫిక్స్‌ అన్నది పార్టీ కేడర్‌ మాట. సామాజికవర్గాల సవిూకరణలతో ఈసారి పోరు కూడా రసవత్తరంగా మారే అవకాశం ఉందంటున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....