Parliament ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ – బీఎస్పీ దోస్తీ : KCR

 

హైదరాబాద్‌, మార్చి 05 (ఇయ్యాల తెలంగాణ) : వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ  కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెల్లడిరచారు. మంగళవారం నాడు అయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తో కలిసి విూడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ మాట్టాడుతూ చాలా అంశంలో కలిసి పని చేశాం. రేపు ఎన్ని సీట్లు పోటీ చేయాలని అనేది నిర్ణయం తీసుకుంటాం. మాయావతి తో ఇంకా మాట్లాడలేదు. కేవలం ఆర్‌ యస్‌ ప్రవీణ్‌  మాత్రమే మాట్లాడారని అన్నారు.  ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌  కుమార్‌ మాట్లాడుతూ కేసిఆర్‌ ను కలవటం ఆనందంగా  ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్‌, బీజేపీ రెండిరటినీ దేశంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మా స్నేహం తెలంగాణ ను పూర్తిగా మారుస్తుంది. నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్‌ పై వ్యతిరేకత వచ్చిందని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....