Parliament లో రాహుల్‌గాంధీ మాటలు దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి


👉 
కాంగ్రెస్‌ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ

👉 హిందువులు హింసను ప్రోత్సహిస్తారంటూ విషం కక్కారు

👉 కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కశ్మీర్‌ లో అనేక దేవాలయాలను కూలగొట్టారు

👉 ఆర్టికల్‌ 370 ద్వారా హిందూ దళితులకు రిజర్వేషన్ల దక్కకుండా చేసింది

👉 అసలు రాహుల్‌ గాంధీ హిందువేనా..?

👉 హిందూ సమాజాన్ని కించపపర్చిన రాహుల్‌ గాంధీ ప్రపంచంలోని  హిందువులందరికీ క్షమాపణ చెప్పాలి

👉 మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు డిమాండ్‌

హైదరాబాద్‌, జూలై 2 (ఇయ్యాల తెలంగాణ) : పార్లమెంట్‌ లో ప్రతిపక్ష నాయకుడి పదవి రాజ్యాంగబద్ధమైనది. ప్రజలు పార్లమెంటు సభ్యుల నుంచి వాస్తవాలను కోరుకుంటారని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు అన్నారు. అంతే కాకుండా పార్లమెంట్‌ లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు సహేతుకమైన విమర్శలతో నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలన్నారు.కాని కాని, రాహుల్‌ గాంధీ పార్లమెంటులో మాట్లాడిన మాటలు దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని,హిందువులను కించపర్చేవిధంగా రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖందించారు.మంగళవారం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విూడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, విూడియా ఇంచార్జ్‌ ఎన్వీ సుభాష్‌ తో కలిసి మాట్లాడారు.రాహుల్గాంధీ హిందువులు హింసను ప్రోత్సహిస్తారంటూ విషం కక్కారు. హిందువులపై కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న అభిప్రాయాన్ని వెల్లగక్కారు.భారతదేశ సంస్కృతి గురించి, అయోధ్య గురించి ఇష్టానుసారంగా మాట్లాడారని విమర్శించారు.2004లో నాటి హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే గారి లాంటి వారు కొన్ని అంశాలపై ఆవేశంగా మాట్లాడి తప్పులను ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.కాంగ్రెస్‌ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ. అబద్ధాలకు తల్లిలాంటిది.ఇందిరాగాంధీ మరణం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమంది సిక్కులను ఊచకోత కోశారు. అనేక దేవాలయాలపై దాడులు జరిగాయి.కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కశ్మీర్‌ లో అనేక దేవాలయాలను కూలగొట్టారు. ఆర్టికల్‌ 370 ద్వారా హిందూ దళితులకు రిజర్వేషన్ల దక్కకుండా చేసింది.అసలు రాహుల్‌ గాంధీ హిందువేనా..? హిందువులు హింసకు పాల్పడుతారంటూ హిందూ సమాజాన్ని కించపపర్చిన రాహుల్‌ గాంధీ ప్రపంచంలోని హిందువులందరికీ క్షమాపణ చెప్పాలి.గత ఎన్నికల్లోనూ బిజెపి రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించింది.కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న దుశ్చర్యలను సహించేది లేదు.ప్రజాస్వామ్యాన్ని పరిహాస్యం చేసేలా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....