Parliament లో వెంటనే SC వర్గీకరణ బిల్లు పెట్టి ఉపకులాలను “ఎ” వర్గంలో చేర్చాలి

హైదరాబాద్, ఫిబ్రవరి 08 (ఇయ్యాల తెలంగాణ) : పార్లమెంటు లో వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఉపకులాలను “ఎ” వర్గంలో చేర్చాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధక్షుడు చంద్రగిరి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు భైరి వేంకటేశం మోచీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నాంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చంద్రగిరి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడి హామీ మేరకు దళిత సమస్యలపై చిత్త శుద్ది ఉంటే ఎస్సీ వర్గీకరణ బిల్లును వేంటనే ప్రస్తుత పార్లమెంట్ ముగింపు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని హామీ మేరకు వర్గీకరణపై కమిటిని ఏర్పరచి చేతులు దులుపుకున్నారని, కమిటి కార్యాచరణ  విధి విధానాలు ఇప్పటికి తెలియవని అన్నారు. ఎస్సీ వర్గీకరణ లో ఉపకులాలన్నిటిని “ఎ” వర్గంలో చేర్చి సామాజిక న్యాయం చేయాలని అన్నారు. ఎస్సి వర్గీకరణ పై సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేత్రృత్వంలోని ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున వర్గీకరణకు అనుకూలంగా తమ వాదనలు వినిపించుటకు న్యాయవాదిని నియమించి  మంత్రి దామోదర రాజనర్సింహ నేత్రుత్వంలో ఒక బ్రృందాన్ని ఢిల్లీకి పంపినందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఉపకులాల నాయకులు హమీల్ పూర్ శివ శంకర్, శివ మాన్కార్, మారుతి, బలరాం ఉత్కార్, సల్లా సతీష్ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....