
హైదరాబాద్, జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపేసింది.. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి మందలించిందన్న కోపంతో తన ప్రియుడు, అతని తమ్ముడుతో కలిసి కూతురు కన్నతల్లినే చంపేసింది.. జీడిమెట్లలోని ఎన్ఎల్బీ నగర్లో ఈ దారుణ ఘటన జరిగింది. 10వ తరగతి చదువుతున్న తేజశ్రీకి.. నల్లగొండకు చెందిన పగిల్ల శివ (19) అనే యువకుడితో 8 నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడిరది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసుకుంది. డీజే ప్లేయర్ అయిన శివ ? తేజశ్రీ ఫోన్లు, మెసేజ్‌లతో ప్రేమలో మునిగిపోయారు. అయితే.. వీరిద్దరి ప్రేమ వ్యవహారం తల్లికి తెలిసింది. ఈ వయసులో ఇది సరైన పద్ధతి కాదని? బాగా చదువుకోవాలని కూతురిని మందలించింది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది. ఇద్దరూ కలిసి హత్యకు స్కెచ్ వేశారు. అందుకు శివ తన తమ్ముడు పగిల్లా యశ్వంత్(18) సహాయం తీసుకున్నాడు.
ఈ క్రమంలో శివ, యశ్వంత్ ఇంటికి రాగా.. తేజశ్రీ కలిసి ముగ్గురూ కలిసి ఒంటరిగా ఉన్న తల్లిని కిరాతకంగా చంపేసారు. స్థానికుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.. ఐదు రోజుల క్రితం తేజశ్రీ ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.. ఈ క్రమంలోనే.. మైనర్ బాలికతో పాటు ఇద్దరు అబ్బాయిలు నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి చున్నీతో ఉరివేసి తలపై బాది అంజలిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. చంపిన చున్నీని నిందితుడు నడుముకి కట్టుకొని పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తేజశ్రీ తల్లి అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్‌గా ఉన్నారు. తొర్రూరు దగ్గర ఇనుగుర్తి స్వగ్రామం. కూతురే తల్లిని ఇలా దారుణంగా చంపేయడంతో ఆ కళాబృందంలో సభ్యులంతా ఇప్పుడు షాక్‌లో ఉన్నారు.అంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐదు రోజుల క్రితం తేజశ్రీ ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని.. ఈ విషయం గురించి పోలీసులకి ఫిర్యాదు కూడా చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో చిన్న కూతురు లేని సమయంలో పెద్ద కూతురు ప్రియుడుతో కలిసి హత్య చేసినట్లు తెలిపారు. చిన్న కూతురు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం తమకు తెలిసినట్లు తెలిపారు.