రాజకీయాలకు అతీతంగా Bonalu

సవిూక్షా సమావేశంలో మంత్రి పొన్నం

సికింద్రాబాద్‌, జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్‌ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలు ` 2025 పై హైదరాబాద్‌ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ వివిధ విభాగాల అధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో  స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ,జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన,డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత,స్థానిక కార్పొరేటర్‌ సుచిత్ర శ్రీకాంత్‌ ,మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి,కోట నీలిమ వివిధ విభాగాల అధికారులు,ముఖ్య నేతలు పాల్గోన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ చరిత్రాత్మకమైన మహిమ గల ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా అమ్మవారి సేవ చేసుకుందామని అన్నారు.

ప్రభుత్వం పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన స్థానికులు సహకారం లేకపోతే విజయవంతం కాదు. గత సంవత్సరం ఏమైనా పొరపాటు జరిగితే సవిూక్షించుకుని మరిన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ సవిూక్ష. దేవాలయ ఏర్పాట్ల కోసం భాగస్వామ్యం అవుతున్న అందరికీ అభినందనలు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయ ఈవో నీ కోరుతున్న ఆలయం లోపల కేబుల్‌ వైర్‌ లు కొత్తవి వేసి ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు.

బాకికేడిరగ్‌  జాలి ఏర్పాటు చేయాలి. ఆతిధ్యం ఇవ్వడంలో హైదరాబాద్‌ నగర ప్రజలు ఎవరికి తీసి పోరు. దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు స్థానిక హైదరాబాద్‌ ప్రజలు వారి ఆతిధ్యం ఇవ్వాలి. ఏ ఏ పండగలు ఆయా ఏరియాలలో వాటర్‌ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి..అవసరమైతే రెండు సార్లు ఇవ్వండి. హైదరాబాద్‌ మొత్తం ఒకే సారి అయితే కొంత ఇబ్బంది ఉంటుంది.. కానీ ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉంటుంది..భద్రత విషయంలో పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి..ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి. 3600 దేవాలయాలకు సంబంధించి సవిూక్ష రాష్ట్ర స్థాయి అధికారులతో జరిగింది. గోల్కొండ ,ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట , లాల్‌ దర్వాజా ఇలా ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. జోగిని వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. మాకు బోనం ఎత్తుకునే వారే ప్రథమ ప్రాధాన్యత..బోనాల సమయంలో కాకుండా రద్దీ తక్కువ ఉన్న సమయంలో వీఐపీ వస్తె ఇబ్బందులు ఉండవని అన్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి. డెక్కన్‌ మానవ సేవ సమితి , ఇతర సంస్థలు ఇక్కడ చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నాయి. అందరూ వారి సహకారం అందించి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని అన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....