Rajendra Nagarలో ఘనంగా పదవీ విరమణ సన్మాన మహోత్సవం !

రాజేంద్ర నగర్, ఫిబ్రవరి 28 (ఇయ్యాల తెలంగాణ) : ఆడిట్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఎక్సమినర్ అఫ్ అకౌంట్స్  షేక్ అబ్దుల్ సత్తార్ రిటర్మెంట్ సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. చార్మినార్ జోన్ ఆడిట్ విభాగంలో సహాయ ఆర్థికాధికారిగా విధులు నిర్వహిస్తున్న సత్తార్ శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్బంగా రాజేంద్రనగర్ లోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో గల  మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన పదవీ విరమణ మహాత్సవ సభలో చార్మినార్ జోన్ ఆడిట్ సెక్షన్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ భాస్కర ఫైనాన్సియల్ అడ్వైజర్ కె. వి . రావ్, సికింద్రాబాద్ ఆడిట్ విభాగం ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ యూ. రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.పలు విభాగాల అధికారులు సిబ్బంది షేక్ అబ్దుల్ సత్తార్ ను ఘనంగా సన్మానించారు. ఆయనతో ఉన్న సంబంధాలను, అనుబంధాలను, ఉద్యోగంలో ఆయనతో ఎదుర్కొన్న సవాళ్ళను గుర్తు చేశారు. సత్తార్ కుటుంబ సభ్యులు గతంలో అనేక చోట్ల కలసి పని చేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ విభాగానికి చెందిన సూపరింటెండెంట్ శ్రీనివాస్, కె. భుజేందర్ బాబు, అనీల్, భాను,యూనుస్, నరేందర్ రెడ్డి, రమేష్, శివ, సందీవ్ తో పాటు ఫైనాన్సియల్ విభాగానికి చెందిన ఉద్యోగులు, ఇతర సర్కిల్ కార్యాలయాలకు చెందిన తోటి ఉద్యోగులు రిటైర్మెంట్ వేడుకలో పాల్గొన్నారు.   

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....

View Comments (1)