Red Cross ఆద్వర్యం లో వృద్ధులు, వికలాంగులకు మెడికల్‌ Health క్యాంప్‌

హైదరాబాద్‌ డిసెంబర్‌ 15 (ఇయ్యాల తెలంగాణ) : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ హైదరాబాద్‌ జిల్లా శాఖ హెల్త్‌ క్యాంప్‌ కన్వీనర్‌ డాక్టర్‌ శ్రీదేవి ఆధ్వర్యంలో   సికింద్రాబాద్‌, వారసిగుడ లోని ఇందిరా నగర్‌ కమ్యూనిటీ హాల్లో మొదటి అంతస్తు లో నమ్రత జస్వాల్‌,అమన్‌ వేదిక సహకారంతో  60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు వికలాంగులకు, తెలంగాణ ప్రభుత్వ వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్‌ జెండర్ల సాధికారత శాఖ మరియు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న మొబైల్‌ మెడికేర్‌ యూనిట్‌    (ఓఓఙ) లో భాగంగా మెడికల్‌ హెల్త్‌ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌ జిల్లా శాఖ చైర్మన్‌ మామిడి భీమ్‌ రెడ్డి విచ్చేసి పేషెంట్లకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. రవి హీలియస్‌ హాస్పిటల్‌ ఎండి డా. బి. విజయ్‌ భాస్కర్‌ గౌడ్‌ పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌ జిల్లా శాఖ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు పి జ్యోతి, ఏఎన్‌ఎం అనిత, సైకాలజిస్ట్‌ జగన్నాథం ప్రవీణ్‌, అమన్‌ వేదిక సిబ్బంది మాయ బ్రహ్మ ,కళావతి, రైజా, స్వప్న, నాగభూషణం, రెడ్‌ క్రాస్‌ వాలంటీర్లు ఎస్‌ ఎం ప్రగతి, షబానా, రూప, వెంకట్‌, ఫార్మసిస్ట్‌ ఏపీ లక్ష్మి, సందీప్‌, గోపాల్‌, మురళి తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....